- విజయవాడ లయోలా కళాశాలలో హిజాబ్ వివాదం
బెజవాడ లయోల కాలేజిలో హిజాబ్ వివాదం నెలకొంది. హిజాబ్ వేసుకొచ్చామని కాలేజీ యాజమాన్యం కాలేజీ యాజమాన్యం విద్యార్థులను కాలేజీలోకి రానివ్వలేదు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- CBN Classes : ఎన్టీఆర్ భవన్‌లో నేటినుంచి శిక్షణ తరగతులు..
స్థానిక ఎన్నికల్లో గెలిచిన తెదేపా ప్రజాప్రతినిధులకు నేటి నుంచి శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించే ఈ శిక్షణ తరగతులను చంద్రబాబు ప్రారంభించనున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కర్నూలు: పంచలింగాల చెక్‌పోస్టు వద్ద భారీగా వెండి పట్టివేత
కర్నూలు సరిహద్దు పంచలింగాల అంతరాష్ట్ర చెక్ పోస్టు వద్ద అధికారులు భారీగా వెండిని పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళుతున్న కారును అధికారులు తనిఖీ చేయగా 167 కేజీల వెండి ఆభరణాలు గుర్తించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Medaram maha jathara 2022: మహా జాతరలో కోలాహలంగా తొలి ఘట్టం.. నేడు సమ్మక్క ఆగమనం
తెలంగాణలో మేడారం జాతరలో తొలి ఘట్టం అంగరంగ వైభవంగా ఆరంభమైంది. శివసత్తుల పూనకాలు, ఆదివాసీల ఆచారాలతో నిండు పున్నమి వేళ బుధవారం రాత్రి 10.47 గంటలకు సారలమ్మ తల్లి గద్దెపై కొలువైన ఘట్టం కనుల పండువగా సాగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దేశంలో స్థిరంగా కరోనా కేసులు.. మరోసారి 30 వేలకు పైనే..
దేశంలో రోజువారీ కరోనా కేసులు మరోసారి 30 వేలకు పైనే నమోదయ్యాయి. కొత్తగా 30,757 మంది వైరస్ బారిన పడ్డట్లు తేలింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆస్పత్రి ఖర్చులు భరించలేక.. కుమారుడ్ని చంపిన తండ్రి
కుమారునికి ఓ అరుదైన వ్యాధి సోకింది. చికిత్స కోసం స్తోమతకు మించి ఖర్చుచేశాడు ఆ తండ్రి. జబ్బు ఇంకా నయం కాలేదు. వైద్యులు పెద్ద ఆస్పత్రికి తీసుకువెళ్లమన్నారు. చికిత్సకు డబ్బులులేక కుమారున్ని గొంతుపిసికి హత్యచేశాడు తండ్రి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- యుద్ధం వస్తే తగ్గేదేలే.. ఏకే-47 పట్టిన 79 ఏళ్ల బామ్మ
సరిహద్దులో లక్ష మందికి పైగా సైన్యంతో రష్యా కాచుకు కూర్చొంది. ఏ సమయంలోనైనా దాడి చేసే అవకాశం ఉందని అగ్రరాజ్యం హెచ్చరిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఉక్రెయిన్ ప్రజలు బెదిరిపోవడం లేదు. తమ దేశాన్ని రక్షించుకునేందుకు చిన్నాపెద్దా తేడా లేకుండా కదిలి వస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఒడుదొడుకుల్లో స్టాక్ మార్కెట్లు- సెన్సెక్స్ 100 మైనస్
స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతోంది. సూచీలు ఒడుదొడుకుల మధ్యే ట్రేడింగ్ సాగిస్తున్నాయి. లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్.. క్రమంగా నష్టాల్లోకి మళ్లింది. ప్రస్తుతం 120 పాయింట్లు కోల్పోయి.. 58 వేల మార్క్ దిగువన ట్రేడవుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- IND VS WI: మూడో టీ20కు అభిమానులకు అనుమతి
వెస్టిండీస్‌తో జరగబోయే మూడో టీ20 మ్యాచ్‌కు పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించనున్నారు. కరోనా వైరస్ ప్రభావం తగ్గుతున్న నేపథ్యంలో అభిమానులను అనుమతించాలని బంగాల్ క్రికెట్ సంఘం చేసిన అభ్యర్థనను బీసీసీఐ అంగీకారం తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నా తల్లి వేశ్య కాదు.. ఆలియా సినిమాపై గంగూబాయ్ తనయుడు ఫైర్
బాలీవుడ్ హీరోయిన్ నచింటిన 'గంగూబాయ్ కతియావాడీ' సినిమాపై గంగూబాయ్ కుటుంబసభ్యులు అసహనం వ్యక్తం చేశారు. ఈ చిత్రం వల్ల తమ కుటుంబం అవమానాలను ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.