ETV Bharat / city

ప్రధాన వార్తలు@ 11AM - ఏపీ ప్రధాన వార్తలు

...

11am top news
11am top news
author img

By

Published : May 16, 2021, 11:02 AM IST

  • కొవిడ్​ రోగులు బయటకొస్తున్నారు.. బీ కేర్ ఫుల్!

కరోనా వైరస్‌ బాధితులు బయట తిరిగేస్తున్నారు. కుటుంబ అవసరాలు.. ఇతర ముఖ్యమైన పనులు చేసుకోక తప్పని పరిస్థితుల్లో కొందరు అనివార్యంగా బయటకు వస్తున్నారు. కొందరికి రోగ నిర్ధారణ పరీక్షల కోసం పరీక్షా కేంద్రాలు, ఆసుపత్రులకు వెళ్లిరావడం తప్పడం లేదు. మరికొందరు మాత్రం అవగాహన లేక, నిర్లక్ష్యంతోనూ ఇళ్ల నుంచి బయటకొస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కోవిడ్ నోడల్ అధికారికే దక్కని పడక.. సమయానికి చికిత్స అందక కన్నుమూత!

ఆయనో జిల్లా అధికారి.. అందులోనూ కొవిడ్‌ ఆసుపత్రుల నోడల్‌ అధికారి. అలాంటి వ్యక్తికే ఆసుపత్రుల్లో పడక దొరక్క ప్రాణాలొదిలిన దయనీయ ఘటన.. అనంతపురంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 4 ట్యాంకర్లతో.. గుంటూరు చేరుకున్న ఆక్సిజన్​ రైలు

గుజరాత్​ నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లతో బయలుదేరిన రైలు గుంటూరు రైల్వేస్టేషన్​కు చేరుకుంది. అధికారుల పర్యవేక్షణలో వాటిని ఆస్పత్రులకు సరఫరా చేపట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నిధులు లేవు.. కరోనా విధులెలా.!

కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత దశలో నిధుల కొరతతో పట్టణ స్థానిక సంస్థలు అల్లాడుతున్నాయి. కొవిడ్‌ సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా కొన్ని చోట్ల పురపాలక, నగర పంచాయతీలు దిక్కులు చూస్తున్న పరిస్థితి. ప్రభుత్వం నుంచి ప్రత్యేక సాయం అందక, కరోనా ప్రభావంతో స్థానికంగా వనరుల సమీకరణ నిలిచిపోవడంతో పారిశుద్ధ్య కార్మికులకు పలు చోట్ల రెండు నెలలుగా వేతనాలు కూడా చెల్లించలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అతి తీవ్ర తుపానుగా 'తౌక్టే'- ఆ రాష్ట్రాల్లో హైఅలర్ట్​

ముంచుకొస్తున్న 'తౌక్టే'.. అత్యంత తీవ్రమైన తుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మే 18 తెల్లవారుజామున గుజరాత్​లోని పోర్​బందర్, మహువా వద్ద తీరం దాటుతుందని వెల్లడించింది. ఆదివారం, సోమవారం పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దేశంలో మరో 3.11లక్షల కేసులు.. 4వేల మరణాలు

దేశంలో రోజువారీ కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 3.11లక్షల మందికి వైరస్ సోకినట్లు తేలింది. అయితే మరణాలు మాత్రం మరోసారి 4వేలకు పైగా నమోదయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'భారత్​లోకి సింగిల్​ డోసు స్పుత్నిక్ టీకా' ​

రష్యా అభివృద్ధి చేసిన సింగిల్​ డోసు టీకా 'స్పుత్నిక్​ లైట్'​ను త్వరలోనే భారత్​లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుపుతున్నామని ఆ దేశ రాయబారి తెలిపారు. భారత్​లో తమ స్పుత్నిక్​ వీ టీకాను ఏడాదికి 850 మిలియన్ల డోసుల చొప్పున ఉత్పత్తి చేస్తామని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'రూపాంతర వైరస్‌పై టీకాల ప్రభావం స్వల్పం'

భారత్​లో ఉత్పరివర్తనం చెందిన 'బీ1.617.2' వైరస్​పై టీకాల ప్రభావం తక్కువగానే ఉంటుందని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ ఆంటోని హార్న్‌డెన్‌ అభిప్రాయపడ్డారు. ఈ వైరస్‌ను 'పట్టించుకోదగ్గ రూపాంతరం'గా వ్యవహరించారు. అయితే ఇది టీకాలకు లొంగదని, దీని ద్వారా వ్యాధి తీవ్రత పెరిగిందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బాల్​ ట్యాంపరింగ్​ వివాదంపై మరోసారి దర్యాప్తు!

'బాల్​ ట్యాంపరింగ్​' అంశం గురించి తాజాగా ఆసీస్ క్రికెటర్​ బాన్​క్రాఫ్ట్ చేసిన వ్యాఖ్యలపై స్పందించింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఈ వ్యవహారంలో ఎవరికైనా సమాచారం తెలిసి ఉంటే స్వచ్ఛందంగా ముందుకు రావాలని తెలిపింది. ఈ ఘటనపై మరోసారి దర్యాప్తు చేసేందుకు సిద్ధమని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ప్రభాస్​ 'ఆదిపురుష్'​లో బిగ్​బాస్​ విన్నర్​!

హీరో ప్రభాస్​ నటిస్తున్న 'ఆదిపురుష్'​ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం హిందీ బిగ్​బాస్​ విన్నర్​ సిద్ధార్థ్​ శుక్లాను తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోందని తెలిసింది. ఇప్పటికే అతడితో కలిసి సంప్రదింపులు కూడా జరిపిందట. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.