ETV Bharat / city

కరోనా సోకిన గర్భిణికి పురుడు పోసిన 108 సిబ్బంది - రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తలు

తెలంగాణ.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కరోనా సోకిన ఓ గర్భిణికి నొప్పులు రాగా.. 108 అంబులెన్స్​ సిబ్బంది ఆమెకు పురుడు పోశారు. అనంతరం తల్లి, బిడ్డను వేములవాడ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వారిద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు.

108-staff-helped
108-staff-helped
author img

By

Published : Oct 3, 2020, 10:58 AM IST

కరోనా సోకిన ఓ గర్భిణికి 108 అంబులెన్స్​ సిబ్బంది పురుడు పోసిన ఘటన తెలంగాణలోని.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శుక్రవారం జరిగింది. పట్టణంలో న్యూ అర్బన్​ కాలనీకి చెందిన అనూష.. నిండు గర్భిణీగా ఉన్నప్పుడు కరోనా వైరస్​ సోకింది. శుక్రవారం ఆమెకు నొప్పులు రాగా బంధువులు వైద్యులను సంప్రదిస్తే.. హైదరాబాద్​ తరలించమన్నారు. ఈ మేరకు 108 అంబులెన్స్​కు​ సమాచారం అందించగా సిబ్బంది చేరుకుని ఆమెకు వాహనంలో పురుడు పోయగా మగబిడ్డకు జన్మనిచ్చింది.

అంబులెన్స్​లో టెక్నీషియన్​ స్వాతి ఆమెకు ప్రాథమికంగా చికిత్స అందించి.. అనంతరం వేములవాడ ఆరోగ్య కేంద్రానికి తరలించగా తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. తొలిసారి అయినా.. కాన్పును సక్రమంగా నిర్వహించిన 108 టెక్నీషియన్​ స్వాతి, పైలెట్​ బాలకృష్ణను స్థానికులు అభినందించారు.

ఇదీ చదవండిః అటల్​ సొరంగ మార్గాన్ని ప్రారంభించిన మోదీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.