ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1PM

.

ప్రధాన వార్తలు @ 1PM
ప్రధాన వార్తలు @ 1PM
author img

By

Published : May 6, 2021, 1:01 PM IST

  • అమర్‌రాజా ఇష్యూ: పీసీబీ ఉత్తర్వులను సస్పెండ్‌ చేసిన హైకోర్టు

తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌ కుటుంబ యాజమాన్యంలోని అమర్‌రాజా బ్యాటరీస్‌ లిమిటెడ్‌ కంపెనీకి హైకోర్టులో ఊరట లభించింది. పరిశ్రమను మూసివేయాలంటూ కాలుష్యనియంత్రణ మండలి ఇచ్చిన ఉత్తర్వులను న్యాయస్థానం సస్పెండ్‌ చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • కొవిడ్ వైద్య చికిత్సలపై హైకోర్టులో విచారణ.. సర్కార్ తీరుపై అసంతృప్తి

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకల లభ్యత, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఫీజుల వసూళ్లు సహా కొవిడ్ చికిత్సకు వినియోగించే ఇతర మందులపై హైకోర్టు విచారణ జరుపుతోంది. ఈ మేరకు వాదనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన కోర్టు.. రాష్ట్ర ప్రభుత్వ కొవిడ్ నియంత్రణ చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఇంటింటికీ వ్యాక్సిన్ వేసే బాధ్యత సర్కార్ దే : గోరంట్ల

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని శిక్షణ కళాశాలలో ప్రజలు కొవిడ్ వ్యాక్సిన్ కోసం గుమిగూడటంపై తెదేపా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్విట్టర్​లో వెల్లడించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • అజిత్‌సింగ్ మృతి పట్ల చంద్రబాబు సంతాపం

ఆర్​ఎల్​డీ పార్టీ అధినేత అజిత్ సింగ్ కరోనాతో మృతి చెందడం పట్ల తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు. గురుగ్రామ్​లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • కరోనా కట్టడికి కేరళలో లాక్​డౌన్

కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేరళలో లాక్​డౌన్ విధించింది విజయన్ సర్కార్. మే 8 నుంచి 16 వరకు ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • బంగాల్ హింసపై కేంద్రం నిజనిర్ధరణ కమిటీ ఏర్పాటు

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బంగాల్​లో చెలరేగిన హింసపై నిజానిజాలను తేల్చేందుకు నలుగురు సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసింది కేంద్రం. వీరిని ఆ రాష్ట్రానికి పంపింది. ఈ బృందానికి కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి నేతృత్వం వహిస్తారని వెల్లడించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఆక్సిజన్ లేక ఐసీయూకి తాళం.. ఎనిమిది మంది మృతి

అది దేశ రాజధాని దిల్లీ శివారులోని ఓ ప్రైవేటు ఆస్పత్రి.. అత్యవసర చికిత్స అందించే ఐసీయూకు తాళం ఉంది. అనుక్షణం రోగులను పర్యవేక్షించాల్సిన వైద్యులు కానీ.. ఇతర వైద్య సిబ్బంది కానీ ఏ ఒక్కరు ఆ దరిదాపుల్లో లేరు. అక్కడికి వెళ్లిన రోగుల బంధువులకు శ్మశానంలో ఉండే వాతావరణం కనిపించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • జాదవ్ కేసు విచారణకు సహకరించండి: పాక్ కోర్టు

కుల్​భూషణ్ జాదవ్ కేసులో విచారణకు సహకరించాలని పాకిస్థాన్ కోర్టు భారత్​ను కోరింది. దీనిపై ఇస్లామాబాద్ హైకోర్టులో వాదనలు జరిగాయి. పాకిస్థాన్ కోర్టుల్లో హాజరు కాకుండా ఉండేందుకు భారత్ అభ్యంతరాలను లేవనెత్తుతోందని పాక్ అటార్నీ జనరల్ వాదించారు. అయితే కోర్టు ముందు హాజరైతే సార్వభౌమాధికారాన్ని వదులుకున్నట్లు కాదని ధర్మాసనం పేర్కొంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • నాడు తల్లి, నేడు సోదరి.. మహిళా క్రికెటర్ ఇంట్లో విషాదం

టీమ్ఇండియా మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి సోదరి వత్సల కరోనాతో కన్నుమూశారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతు తుదిశ్వాస విడిచారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • "హిట్​ 2' చేయకపోవడానికి కారణమదే!'

హీరో నాని నిర్మాణంలో రూపొందుతోన్న 'హిట్​ 2' సినిమాను వదులుకోవడానికి ప్రధానకారణం 'పాగల్​' సినిమా అని అంటున్నారు యువ కథానాయకుడు విశ్వక్​సేన్. 'పాగల్​' షూటింగ్​ నేపథ్యంలో 'హిట్​ 2'కు డేట్లు కేటాయించలేక పోవడం వల్లే ఆ సినిమా నుంచి తప్పుకున్నట్లు.. ఆలీతో సరదాగా కార్యక్రమంలో వెల్లడించారు. వీటితో పాటు తన వ్యక్తిగత జీవితంలోని విశేషాలు, సినిమా కబుర్లను పంచుకున్నారు విశ్వక్​సేన్​. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.