Twitter Blue Tick Subscription Cost : ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్న అనంతరం ఎలాన్ మస్క్ సంస్థ సంబంధిత విషయాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ బ్లూ బ్యాడ్జ్ ఫీచర్‌లోనూ కొన్ని మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ట్విట్టర్ యూజర్లకు వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తిగా మారిపోతుందని తాజాగా మస్క్ ట్వీట్ చేశారు.
వెరిఫైడ్ అకౌంట్ కలిగి ఉండాలని భావించే వారు అంటే బ్లూ టిక్ కోరుకునే వారు ఇకపై చార్జీలు చెల్లించుకోవాల్సి వస్తుందని సమాచారం. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ఈ దిశగా ప్రణాళికలు రచిస్తోందని తెలుస్తోంది. నెలకు 19.99 డాలర్లు చెల్లించాల్లిందేనని నిపుణులు చెబుతున్నారు. మన కరెన్సీలో చెప్పుకుంటే నెలకు దాదాపు రూ.1600 కట్టాల్సి ఉంటుంది.
ఒకవేళ సబ్‌స్క్రిప్షన్ తీసుకోకపోతే బ్లూ టిక్ కేవలం 90 రోజులే ఉంటుంది. ఈ కొత్త రూల్‌ను నవంబర్ 7 నాటికి అమలులోకి తీసుకువచ్చే దిశగా మస్క్ యోచిస్తున్నట్లు తెలిసింది. సంబంధిత పనులు పూర్తి చేయకపోతే ఈ ప్రాజెక్టులో ఉన్న ఉద్యోగులందరినీ ఇంటికి పంపించేందుకు ఆయన సిద్ధం అయినట్లు సమాచారం.
2021లో ట్విట్టర్ బ్లూ టిక్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ట్విట్టర్ బ్లూ టిక్ కలిగిన వారికి ప్రీమియం ఫీచర్లు లభిస్తాయి. ట్వీట్స్‌ను ఎడిట్ చేసుకోవడం సహా పలు రకాల సర్వీసులు పొందొచ్చు.
ఇవీ చదవండి: రూ.82 లక్షల కోట్లకు అదానీ గ్రూప్ విలువ!.. భారీగా కొత్త పెట్టుబడులు