ETV Bharat / business

టర్మ్ పాలసీలకు రక్షణగా 'రైడర్లు' - insurance rider policy

Insurance Policy Rider : అనుకోని ఘటనలు ఎదురై.. ఆర్జించే కుటుంబ పెద్ద దూరమైనప్పుడు.. ఆర్థికంగా ఆ కుటుంబానికి భరోసానిచ్చేవి బీమా పాలసీలు. వీటిలో తక్కువ ప్రీమియంతో అధిక రక్షణ కల్పించే టర్మ్‌ పాలసీల వైపు ఇప్పుడు ఎంతోమంది మొగ్గు చూపుతున్నారు. దీనికి కొన్ని అనుబంధ పాలసీలు (రైడర్లు) జోడించుకోవడం ద్వారా అదనపు రక్షణ పొందేందుకు అవకాశం ఉంటుంది. అవేమిటి? ఎలా ఉపయోగ పడతాయి? తెలుసుకుందాం.

term life insurance policy
రైడర్లు
author img

By

Published : Sep 18, 2022, 11:27 AM IST

Insurance Policy Rider : పాలసీదారుడికి ఏదైనా జరిగినప్పుడు మాత్రమే టర్మ్‌ పాలసీ ద్వారా పరిహారం అందుతుంది. కానీ, ప్రతిసారీ ఇలాగే జరగాలని లేదు. కొన్ని ప్రమాదాల్లో గాయాలపాలై.. ఆర్జించే శక్తిని కోల్పోవచ్చు. తీవ్ర వ్యాధుల బారిన పడొచ్చు. దీనివల్ల పని చేయలేని పరిస్థితి ఎదురుకావచ్చు. శాశ్వత వైకల్యంతో కదల్లేని స్థితికి చేరొచ్చు. చాలామంది వీటి గురించి అంతగా పట్టించుకోరు. కానీ, మన చుట్టూ కనిపిస్తున్న వాటిని తేలిగ్గా తీసుకోవద్దు. తాత్కాలికంగా లేదా పూర్తిగా సంపాదన ఆగిపోయే సందర్భం వచ్చినప్పుడూ పాలసీలు పరిహారం ఇచ్చేలా ఉండాలి.

ప్రాథమిక టర్మ్‌ పాలసీకి కొంత అదనపు భద్రత జోడించేందుకు ఉపయోగపడేవే ఈ 'రైడర్లు'. బీమా సంస్థలు టర్మ్‌ పాలసీతోపాటే ఈ అనుబంధ పాలసీలనూ అందిస్తుంటాయి. వీటిలో ఏది ఎంచుకోవాలన్నది పాలసీదారుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

ప్రమాదంలో మరణిస్తే..
ప్రాథమిక టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీదారుడు మరణించినప్పుడు పరిహారం ఇస్తుంది. 'యాక్సిడెంటల్‌ డెత్‌ బెనిఫిట్‌ రైడర్‌ (ఏడీబీ)' జోడించుకున్న పాలసీదారుడు ప్రమాదంలో మరణించిన సందర్భంలో అదనపు పరిహారం అందుతుంది. ఉదాహరణకు ప్రాథమిక టర్మ్‌ పాలసీ రూ.25లక్షలు ఉందనుకుందాం. దీనికి ఏడీబీ రూ.15లక్షలు ఉంది. ఒకవేళ పాలసీదారుడు ప్రమాదంలో మరణిస్తే మొత్తం రూ.40లక్షల పరిహారం నామినీకి అందుతుంది. ప్రమాదంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో అధిక ఆర్థిక రక్షణ ఉండటం ఎప్పుడూ మంచిదే. కాబట్టి, టర్మ్‌ పాలసీ తీసుకునేటప్పుడు ఒకసారి దీని గురించీ ఆలోచించండి.

గాయపడినప్పుడు..
ప్రమాదంలో తీవ్రగాయాలు తగలడం, కొన్నాళ్లపాటు లేదా శాశ్వత వైకల్యం సంభవించినప్పుడు పరిహారం ఇచ్చేందుకు 'యాక్సిడెంటల్‌ డిజేబిలిటీ బెనిఫిట్‌ రైడర్‌'ను ఎంచుకోవాలి. ప్రమాదంలో గాయాలపాలైనప్పుడు కొన్ని రోజులపాటు పని చేసే సామర్థ్యం ఉండకపోవచ్చు. కొన్నిసార్లు శాశ్వత వైకల్యం అంటే ఒక చేతిని కోల్పోవడం, కాలు కోల్పోవడం, కంటి చూపు దెబ్బతినడంలాంటివి ఎదురవ్వొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం చేయడం సాధ్యం కాదు. లేదా ఆర్జన శక్తి తగ్గిపోవచ్చు. ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు ఈ రైడర్‌ ద్వారా పరిహారం అందుతుంది. కొన్ని పాలసీలు అన్ని రకాల వైకల్యాలకూ పరిహారం ఇస్తుండగా, మరికొన్ని కేవలం శాశ్వత వైకల్యానికి మాత్రమే చెల్లిస్తున్నాయి. బీమా సంస్థలను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది.

ఆదాయం ఇచ్చేలా..
పాలసీదారుడు మరణించినప్పుడు ఆ వ్యక్తి కుటుంబానికి కొన్నాళ్లపాటు క్రమం తప్పకుండా ఆదాయం అందేలా చూసేది 'ఇన్‌కం బెనిఫిట్‌ రైడర్‌'. పాలసీదారుడు తన కుటుంబానికి ఎన్ని నెలలపాటు ఆదాయం అందాలి అన్నది నిర్ణయించుకోవచ్చు. ప్రాథమిక పాలసీ పరిహారం చెల్లించిన తర్వాత ఇది అదనంగా ఆదాయాన్ని అందిస్తుంది. కుటుంబం ఆర్థికంగా స్థిరత్వం సాధించేందుకు ఈ రైడర్‌ తోడ్పడుతుందని చెప్పొచ్చు.

ప్రీమియం చెల్లించకుండా..
ఉద్యోగం లేదా వ్యాపారం చేయడం సాధ్యం కాని పరిస్థితుల్లో బీమా పాలసీకి ప్రీమియం చెల్లించడం కష్టమవుతుంది. ఇలాంటి సందర్భాల్లో ప్రీమియం చెల్లించనవసరం లేకుండా 'వైవర్‌ ఆఫ్‌ ప్రీమియం రైడర్‌' తోడ్పడుతుంది. డిజేబిలిటీ, క్రిటికల్‌ ఇల్‌నెస్‌ రైడర్లకు తోడుగా దీన్ని తీసుకోవాల్సి వస్తుంది. పాలసీ కొనసాగుతున్నప్పుడు.. పాలసీదారుడు వైకల్యం పాలైనా, తీవ్ర వ్యాధుల బారిన పడినా ఈ రైడర్‌ మిగతా ప్రీమియాలను చెల్లిస్తుంది. పాలసీదారుడు మరణించినప్పుడు ప్రాథమిక పాలసీ పూర్తి పరిహారాన్ని నిబంధనల మేరకు నామినీకి ఇస్తుంది.

తీవ్ర వ్యాధులు బాధిస్తే..: క్యాన్సర్‌, మూత్రపిండాల వ్యాధులు, గుండెపోటు ఇలా ఎన్నో రకాల తీవ్ర వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. 'క్రిటికల్‌ ఇల్‌నెస్‌ బెనిఫిట్‌ రైడర్‌' ఎంచుకుంటే తీవ్ర వ్యాధులను గుర్తించిన వెంటనే పరిహారం అందిస్తాయి బీమా సంస్థలు. వ్యాధుల జాబితా బీమా సంస్థలను బట్టి మారుతూ ఉంటుంది. వీలైనన్ని ఎక్కువ వ్యాధులకు పరిహారం ఇచ్చేలా ఈ రైడర్‌ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.
ఈ అనుబంధ పాలసీలకు అదనంగా కొంత ప్రీమియం చెల్లించాలి. వీటివల్ల కుటుంబానికి లభించే ఆర్థిక రక్షణ పెరుగుతుంది. కాబట్టి, ప్రీమియం గురించి ఆలోచించకుండా అవసరమైన వాటిని ఎంచుకోవడం ఉత్తమం. బీమా పాలసీలపై పూర్తి అవగాహన పెంచుకొని, సరైన నిర్ణయం తీసుకున్నప్పుడే ఆర్థికంగా భరోసా లభిస్తుందని మర్చిపోవద్దు.

- విఘ్నేశ్‌ సహానే, ఎండీ-సీఈఓ, ఏజెస్‌ ఫెడరల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌

ఇవీ చదవండి: ఆరోగ్య బీమా సంస్థల ఆగడాలకు చెక్​! ఇకపై పాలసీలన్నీ ఒకేచోట

RTO ఆఫీస్​కు వెళ్లే పనిలేదు.. లైసెన్స్, రిజిస్ట్రేషన్ సహా 58 సేవలు ఆన్​లైన్​లోనే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.