ETV Bharat / business

హెల్త్​ ఇన్సూరెన్స్ ఎలా క్లెయిం చేయాలో తెలుసా? - హెల్త్​ ఇన్సూరెన్స్​ క్లెయిం

కొవిడ్‌ భయాందోళనల నేపథ్యంలో మరోసారి ఆరోగ్య బీమాపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) క్లెయింలు వేగంగా పరిష్కారమయ్యేలా చూడాలని ఆరోగ్య బీమా సంస్థలకు సూచించింది. పాలసీదారులూ కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటే.. ఇబ్బందుల్లేకుండా నగదు రహిత చికిత్స చేయించుకునే వీలుంటుంది. ఒకవేళ బిల్లు మీరు సొంతంగా చెల్లించినా, సులభంగానే ఆ మొత్తాన్ని రాబట్టుకోవచ్చు.

how to claim health insurance in telugu
how to claim health insurance in telugu
author img

By

Published : Dec 30, 2022, 3:44 PM IST

Health Insurance Claim Process: చాలామంది ఇప్పుడు ఒకటికి మించి పాలసీలను తీసుకుంటున్నారు. యాజమాన్యాలు అందించే బృంద ఆరోగ్య బీమా పాలసీకి తోడుగా, సొంతంగా మరో పాలసీని ఎంచుకుంటున్నారు. దీంతో అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పుడు ఏ పాలసీని ముందు వాడాలి అనే సందేహం వస్తోంది. ఒకేసారి రెండు పాలసీలను వాడి, పరిహారం తీసుకోవాలనుకుంటే అది మోసపూరిత చర్య కిందకు వస్తుంది. కాబట్టి, ఇలాంటి ప్రయత్నం ఎప్పుడూ చేయొద్దు. ఒకవేళ ఆసుపత్రి ఖర్చులు ఒక పాలసీకి మించి అయినప్పుడు రెండో పాలసీని ఉపయోగించాల్సి ఉంటుంది.

ఇక్కడ ఒక ఉదాహరణ గమనిద్దాం..
కార్యాలయం ఇచ్చిన బృంద పాలసీ విలువ రూ.5లక్షలు అనుకుందాం. మీరు సొంతంగా మరో రూ.5లక్షల పాలసీ తీసుకున్నారు. ఆసుపత్రిలో చేరినప్పుడు బిల్లు రూ.8 లక్షలు అయ్యిందనుకుందాం. అప్పుడు తొలుత ఆఫీస్‌ ఇన్సూరెన్స్‌ను వాడుకోవాలి. ఆతర్వాత మీ సొంతంగా తీసుకున్న పాలసీని క్లెయిం చేసుకోవాలి. ఇక్కడ మరో విషయం.. ఏది ముందు వాడాలి, ఏది తర్వాత ఉపయోగించాలనేది పూర్తిగా మీ నిర్ణయమే. వ్యక్తిగత పాలసీకి బదులు టాపప్‌ పాలసీ తీసుకున్నారనుకోండి.. అప్పుడు కచ్చితంగా ప్రాథమిక పాలసీని వాడి, మిగిలిన మొత్తానికే టాపప్‌ను ఉపయోగించాల్సి వస్తుంది.

క్లెయిం ఎలా..
సాధారణంగా ఆసుపత్రిలో ఒకే బీమా సంస్థ పాలసీని అనుమతిస్తారు. అధికంగా అయిన ఖర్చులను రెండో బీమా సంస్థ నుంచి తర్వాత క్లెయిం చేసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో కొన్ని ఇబ్బందులు రావచ్చు.

ముందుగా క్లెయిం చేసిన బీమా సంస్థ దగ్గరే బిల్లులన్నీ ఉంటాయి. కాబట్టి, అసలు బిల్లులతోపాటు, వాటి నకలు కాపీలనూ తీసుకొని, ఆసుపత్రితో అటెస్టేషన్‌ చేయించుకోవాలి. ఒకవేళ మొదటి బీమా సంస్థ మీ క్లెయింను అప్పటికి అంగీకరించకపోతే.. రెండో బీమా సంస్థకు ఆ విషయాన్ని రాత పూర్వకంగా తెలియజేయాలి. అప్పుడు బీమా సంస్థ క్లెయిం దాఖలుకు ఆలస్యమైనా పట్టించుకోదు. ఇది సందర్భాన్ని బట్టి మారుతుంది. కాబట్టి, ముందుగానే మీ బీమా సంస్థ సేవా కేంద్రాన్ని సంప్రదించి, పూర్తి వివరాలు తెలుసుకోవడం అవసరం.

ఏం చేయాలంటే..
ఏ పాలసీని ముందు వాడాలి.. దేన్ని తర్వాత అనేది పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. అయినప్పటికీ కొన్ని సందర్భాలను బట్టి, నిర్ణయం తీసుకోవాలి.

  • కంపెనీ అందిస్తున్న బీమా పాలసీ ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకూ మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. సాధారణంగా వీటికి నో క్లెయిం బోనస్‌లాంటివి ఉండవు. వ్యక్తిగత పాలసీలకు నో క్లెయిం బోనస్‌ అందుతుంది. దీనివల్ల పాలసీని పునరుద్ధరించుకునేటప్పుడు ప్రీమియం తగ్గుతుంది. లేదా పాలసీ విలువ పెరుగుతుంది.
  • ముందస్తు వ్యాధులకు కొన్ని బీమా పాలసీలు కనీసం 4 ఏళ్ల తర్వాతే పరిహారం ఇస్తాయి. బృంద బీమా పాలసీల్లో ఇలాంటి పరిమితి ఉండకపోవచ్చు. కాబట్టి, ఇలాంటి సందర్భాల్లో కార్పొరేట్‌ పాలసీనే వాడుకోవాలి.
  • ఆసుపత్రిలో చేరినప్పుడు ఏ పాలసీకి అధిక ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకోండి. దాన్నిబట్టి, ఆ పాలసీని వాడటం వల్ల ఇబ్బందులు ఉండవు.
  • ఇవీ చదవండి:
  • పెరిగిన బంగారం, వెండి ధరలు.. నేటి లెక్కలు ఇలా..
  • డిజిటల్ లోన్ తీసుకుంటున్నారా? జర భద్రం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.