LPG price hike today : వంట గ్యాస్ ధర పెరిగింది. కమర్షియల్ సిలిండర్ ధరను రూ.25మేర పెంచుతున్నట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రకటించాయి. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశాయి. తాజా పెంపుతో దిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ.1,769కి చేరింది. వంట గ్యాస్ బండ ధర ముంబయిలో రూ.1,721, కోల్‌కతాలో రూ.1,870, చెన్నైలో రూ.1,971గా ఉంది.. తాజా పెంపు ప్రభావం రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య సంస్థలపై పడనుంది.
ఇక గృహాల్లో వినియోగించే సిలిండర్ ధరల్లో ఏ మార్పులు చేయలేదు. హైదరాబాద్‌లో వాణిజ్య సిలిండర్ ధర రూ.1,973కు చేరింది. నగరంలో 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,105గా ఉంది. ఈ విభాగంలో నవంబర్, డిసెంబర్ ధరల్లో ఎటువంటి మార్పు రాలేదు. గతేడాది జనవరిలో రూ.952 సిలిండర్ ధర డిసెంబర్ నాటికి రూ.1,105కు చేరుకొంది.