Amazon Credit On UPI Feature : యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) అందుబాటులోకి వచ్చిన తరువాత డిజిటల్ ఆర్థిక లావాదేవీలు చాలా సులువు అయిపోయాయి. సాధారణంగా ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి మన బ్యాంక్ అకౌంట్ లేదా రూపే క్రెడిట్ కార్డును యూపీఐతో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే బ్యాంకు ఖాతాలో డబ్బులు లేకున్నా, ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ చేసుకోవడానికి వీలవుతుంది. యూపీఐకు క్రెడిట్ కార్డును కూడా అనుసంధానం చేయాల్సిన అవసరం ఉండదు. అది ఎలా అంటే?
అమెజాన్ - క్రెడిట్ లైన్స్
కొన్ని బ్యాంకులు యూపీఐ యూజర్లకు క్రెడిట్ లైన్స్‌ను అందిస్తున్నాయి. దీని ద్వారా తమ బ్యాంకు ఖాతాలో డబ్బులు లేకున్నా, యూపీఐ పేమెంట్స్ చేయడానికి వీలవుతుంది. ఇదే విధానాన్ని ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా త్వరలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
అమెజాన్ ఫైనాన్సియల్ సర్వీసెస్ డివిజన్ అయిన 'అమెజాన్ పే' 2024 ప్రథమార్థంలో 'క్రెడిట్ ఆన్ యూపీఐ' ఫీచర్‌ను ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. దీని వల్ల అమెజాన్ యూజర్లకు మంచి లబ్ధి చేకూరనుంది. అమెజాన్ అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగే ఛాన్స్ ఉంటుంది.
సింపుల్‌గా షాపింగ్
అమెజాన్ క్రెడిట్ ఆన్ యూపీఐ ఫీచర్ కనుక అందుబాటులోకి వస్తే, యూజర్లు తమ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకున్నా, షాపింగ్ చేసుకోలగుతారు. రూపే క్రెడిట్ కార్డును యూపీఐతో అనుసంధానం చేయాల్సిన పని కూడా ఉండదు. అయితే, ఇలా తీసుకున్న క్రెడిట్‌ను (రుణాన్ని) నిర్దిష్ట వ్యవధిలోపు తీర్చేయాల్సి ఉంటుంది.
క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ అంటే ఏమిటి?
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) 'క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ' సేవలను ప్రవేశపెట్టింది. సింపుల్‌గా చెప్పాలంటే, మీ బ్యాంకు అకౌంట్లో డబ్బులు లేనప్పుడు, మీకు ముందస్తుగా ఇచ్చే రుణమే ఈ క్రెడిట్ లైన్. దీని ద్వారా యూపీఐ పేమెంట్స్ చేయడం చాలా సులువు అవుతుంది
2016లో అలా మొదలైంది!
భారతదేశంలో 2016లో యూపీఐ పేమెంట్స్ మొదలయ్యాయి. యూపీఐ సిస్టమ్‌తో సేవింగ్స్ అకౌంట్/ ఓవర్‌డ్రాఫ్ట్ ఖాతా/ ప్రీపెయిడ్ వాలెట్లు/ రూపే క్రెడిట్ కార్డులను అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాతనే యూపీఐ పేమెంట్స్ చేయడానికి వీలవుతుంది.
ఒకప్పుడు ఆన్లైన్ పేమెంట్స్ చేయడానికి బ్యాంక్ అకౌంట్ నంబర్, క్రెడిట్/ డెబిట్ కార్డ్ నంబర్, ఓటీపీ, సీవీవీ, ఎక్స్పైరీ డేట్ లాంటివి అవసరం అయ్యేవి. కానీ నేడు ఫోన్ నంబర్, అకౌంట్ నంబర్, యూపీఐ ఐడీ, యూపీఐ క్యూఆర్ కోడ్లు ఉంటే చాలు, చాలా సులువుగా ఆర్థిక లావాదేవీలు జరపవచ్చు. పైగా ఈ యూపీఐ సర్వీస్ 24x7 అందుబాటులో ఉంటుంది.
ఆపద సమయంలో సాయం అందించే - ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్స్ ఇవే!
ఆర్థిక లక్ష్యాల సాధన కోసం - బెస్ట్ 'సొల్యూషన్ ఓరియెంటెడ్' మ్యూచువల్ ఫండ్స్ ఇవే!