Ambani Granddaughter : ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంటికి వారసురాలు వచ్చింది. ముకేశ్ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ, కోడలు శ్లోకా అంబానీ దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. శ్లోకా అంబానీ బుధవారం పండంటి ఆడబిడ్డకు జన్మినిచ్చారు. అంబానీ ఇంటికి వారసురాలు రావడం వల్ల ఆ ఇంట సంతోషం నెలకొంది.
Shloka Ambani Baby : ఆకాశ్, శ్లోకాలకు 2019లో వివాహం జరిగింది. 2020 డిసెంబర్‌లో ఈ జంట తొలి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం కుమారుడికి రెండేళ్లు. ముంబయి ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవంలో బేబీ బంప్‌తో శ్లోకా కనిపించారు. వారం క్రితం ముంబయిలోని కుటుంబ సభ్యులతో కలిసి సిద్ధి వినాయక ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఆకాశ్ అంబానీ రిలయన్స్ జియో ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
పృథ్వీ 'స్కూల్ కహానీ'..
అయితే ఏడాదిన్నర వయసుకే పృథ్వీని ప్లేస్కూల్లో చేర్పించారు ఆకాశ్- శ్లోక దంపతులు. ముంబయి మలబర్ హిల్‌లోని సన్‌ఫ్లవర్ నర్సరీ స్కూల్లో చేర్చారు. ఆకాశ్, శ్లోక కూడా అదే స్కూల్లో తమ విద్యాభ్యాసం ప్రారంభించడం విశేషం. అయితే.. అంబానీ వారసుడు కాబట్టి పృథ్వీకి ఎక్కడకు వెళ్లినా గట్టి బందోబస్తు ఉండాల్సిందే. అందుకే అతడి కోసం పాఠశాలలోనూ ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయించారు. కానీ దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలానే.. 24 గంటలూ పృథ్వీ వెన్నంటే ఓ వైద్యుడు ఉండేలా చూస్తున్నారు. అంబానీ మనవడు అయినప్పటికీ.. పృథ్వీని అందరు విద్యార్థులతో సమానంగా చూస్తున్నట్లు చెప్పింది సన్‌ఫ్లవర్ నర్సరీ స్కూల్ యాజమాన్యం. అంబానీ వారసుడి 'స్కూల్ కహానీ' కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ప్రధానంగా మూడు రంగాల్లో వ్యాపారాలున్నాయి. చమురు శుద్ధి - పెట్రోకెమికల్స్, రిటైల్, డిజిటల్ సర్వీసెస్ వ్యాపారాలను కంపెనీ నిర్వహిస్తోంది. ఇందులో రిటైల్, డిజిటల్ సర్వీసెస్‌ను అనుబంధ సంస్థలతో కొనసాగిస్తున్నారు. టెలికాం సేవలందించే డిజిటల్ సర్వీసెస్‌ను జియో ఇన్ఫోకామ్ పేరుతో, రిటైల్ విభాగాన్ని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ పేరుతో నడిపిస్తున్నారు. ఇక, ఆయిల్ టు కెమికల్‌తో పాటు న్యూ ఎనర్జీ వ్యాపారాలను మాతృ సంస్థ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు. ఇక తన వ్యాపారాల్లాగే అంబానీకి ముగ్గురు వారసులున్నారు. ఈ క్రమంలోనే కంపెనీ నాయకత్వంలో వారసత్వ ప్రణాళికను ముకేశ్ అంబానీ ప్రకటించారు.