కియా పరిశ్రమ, ఐటీ కంపెనీలు రాష్ట్రం నుంచి తరలిపోతున్నాయన్న వార్తలు అవాస్తమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి అన్నారు. దిల్లీలో జరుగుతున్న ఆటో ఎక్స్‌పోలో ఏపీలో తయారుచేస్తున్న అవేర రెట్రోస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రదర్శనకు ఉంచారు. ఆ స్టాల్‌ను మంత్రి గౌతమ్ రెడ్డి సందర్శించారు. అనంతరం మాట్లాడిన మంత్రి.. రాష్ట్రం నుంచి ఏ పరిశ్రమలు వెళ్లిపోవడం లేదన్నారు. విశాఖలోని కండ్యూంట్ ఐటీ సంస్థకు నోటీసులు ఇచ్చామన్నది అవాస్తమన్నారు. ఐటీ కంపెనీలన్నీ కోయంబత్తూరు వెళ్లిపోతున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించినట్లు.. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఆపేయడం లేదన్నారు. గంపగుత్తగా ఇచ్చే ప్రోత్సాహకాలపై పునరాలోచించి... ఇతర విధానాల్లో పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని స్పష్టం చేశారు.
కియా తరలింపోవటం లేదు
కియా మోటర్స్ తమిళనాడుకు వెళ్తోందన్న వార్తలు అవాస్తమన్నారు మంత్రి గౌతమ్ రెడ్డి. ఈ సమాచారంపై తమిళనాడు పరిశ్రమల ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శితో మాట్లాడారన్నారు. తాము ఏ సంస్థతో సంప్రదింపులు జరపలేదని తమిళనాడు ప్రభుత్వం తెలిపిందని మంత్రి చెప్పారు. కియాపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ఆయనే సమాధానం చెప్పాలని మంత్రి చెప్పారు. విశాఖ నుంచి ఏ ఐటీ సంస్థలు వెళ్లడంలేదని చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలను కల్పిస్తామని పేర్కొన్నారు. అనంతరం కియా మోటర్స్ ప్రతినిధితో వివరణ ఇప్పించారు.
'భారత మార్కెట్‌లో దీర్ఘకాలిక లక్ష్యంతో 1.1 బిలియన్ డాలర్ల పెట్టుబడితో అనంతపురం వద్ద కియా ప్లాంట్ నెలకొల్పాం. కార్ల ఉత్పత్తి కేంద్రాన్ని ప్రస్తుత ప్రాంతం నుంచి మార్చే ఉద్దేశం లేదు. ప్లాంట్ పూర్తి స్థాయి ఉత్పత్తి బాటలో ఉన్నాం. ఇక్కడ తయారయ్యే ప్రపంచ స్థాయి కార్లను భారత వినియోగదారులకు అందిస్తాం'... కియా మోటర్స్ ప్రతినిధి
ఇదీ చదవండి: