ETV Bharat / business

రుణ పునర్‌వ్యవస్థీకరణ చేసుకోవాలా? ఇవి తెలుసుకోండి..

కరోనాతో ఆదాయాలను కోల్పోయిన వారికి రుణ పునర్​వ్యవస్థీకరణ పథకాన్ని తీసుకొచ్చింది ఆర్​బీఐ. అయితే, ఇది చాలా మందికి ఊరటనిచ్చే అంశమైనా.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు, సమస్యలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సౌలభ్యాన్ని ఎవరు తీసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి..

loan reconstruciton
రుణ పునర్‌వ్యవస్థీకరణ
author img

By

Published : Oct 15, 2020, 7:21 AM IST

కరోనా వల్ల ఏర్పడిన ఆర్థిక మందగమన పరిస్థితి ప్రపంచాన్ని అనిశ్చితిలోకి నెట్టేసింది. చాలా మందికి ఆదాయాలు తగ్గిపోయాయి. ఉద్యోగాల కోతను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో రుణాన్ని తిరిగి చెల్లించేందుకు ఉండే ఇబ్బందుల దృష్ట్యా.. రిజర్వు బ్యాంకు ఏకకాల పునర్‌వ్యవస్థీకరణకు అనుమతించింది.

ఇది చాలా ముందికి.. ముఖ్యంగా తక్కువ మొత్తం రుణం తీసుకొని, కొవిడ్‌ వల్ల ఆదాయాలు తగ్గిపోయిన వారికి చాలా మందికి ఊరట కలిగించే పరిణామంగా ఉంది. విద్య, గృహ, వాహనాలు, వ్యక్తిగత, బంగారంపై రుణాలు, క్రెడిట్‌ కార్డు బకాయిలు తదితర రిటైల్‌ రుణాలపై పునర్‌వ్యవస్థీకరణ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే ఇందుకు సంబంధించి షరతులు, నిబంధనలను తెలుసుకోవటం చాలా ముఖ్యం.

రుణ పునర్‌వ్యవస్థీకరణ చేయించుకోవాలనుకునే వారు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలను యాస్క్‌క్రెడ్‌.ఏఐ సీఈఓ ఆర్తీ కన్నా ఈటీవీ భారత్‌తో పంచుకున్నారు.

పునర్‌వ్యవస్థీకరణ అంటే ఏమిటి?

రుణానికి సంబంధించి తిరిగి చెల్లింపుల గడువు, తీరులో మార్పులు చేసేందుకు వీలుగా సంస్థతో కాంట్రాక్టును మార్చుకోవటమే పునర్‌వ్యవస్థీకరణ. ఈఎమ్‌ఐని వాయిదా వేసుకోవటం, మొత్తం రుణం గడువును పెంచుకోవటం తదితర ఆప్షన్లు ఇందులో ఉంటాయి.

ఎందుకు ఈ పునర్‌వ్యవస్థీకరణ?

కొవిడ్‌ మహమ్మారి వల్ల తీవ్ర ప్రభావం పడి, రుణం తిరిగి చెల్లించే సామర్థ్యం తగ్గిపోయినవారిని ఆదుకునేందుకు రిజర్వు బ్యాంకు ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. పునర్‌వ్యవస్థీకరణ జరిగిన రుణాలు నిరర్ధక ఆస్తులు, మొండి బాకీలుగా మారవు. దీని వల్ల బ్యాంకు బ్యాలెన్స్‌ షీట్లపై ఒత్తిడి పెరగదు. కాబట్టి రుణ ఇచ్చిన సంస్థలు, బ్యాంకులు కూడా పునర్‌వ్యవస్థీకరణ ద్వారా ప్రయోజనం పొందుతాయి.

ఎవరు దీనికి అర్హులు?

2020 మార్చి 1 వరకు 30 రోజుల కంటే ఎక్కువ డీఫాల్ట్‌ లేకుండా, స్టాండర్ట్‌గా ఉన్న రుణ ఖాతాలు మాత్రమే పునర్‌వ్యవస్థీకరణ చేసుకోవచ్చు. మార్చి 1 కంటే ముందు రుణం డీఫాల్ట్‌ చేసినట్లైతే పునర్‌వ్యవస్థీకరణ చేసుకోరాదు. కొవిడ్‌ వల్ల ఆదాయం తగ్గిపోయిందని రుణ స్వీకర్త నిరూపించాలి.

ఎలాంటి ఆప్షన్లు ఉన్నాయి?

తిరిగి చెల్లించే కాలాన్ని రీషెడ్యూల్ చేయవచ్చు. జమ అయిన గతంలో లేదా భవిష్యత్ వడ్డీకి సంబంధించిన మొత్తాన్ని మరో రుణంగా మార్చుకోవచ్చు. లేదా రెండేళ్ల వరకు మారటోరియానికి అవకాశం(ఈఎంఐ పేమెంట్ హాలిడే అని కూడా అంటారు) ఇవ్వవచ్చు.

చెల్లించే మొత్తం పెరుగుతుందా?

పునర్​వ్యవస్థీకరణ జరిగిన రుణాలకు సంబంధించి తిరిగి చెల్లించేందుకు మారటోరియం ఉండవచ్చు. దీనితో పెరిగిన కాలానికి కూడా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. దీని ద్వారా రుణంపై చెల్లించే మొత్తం పెరుగుతుంది.

పునర్ వ్యవస్థీకరణకు సాధారణంగా రుణంలో కొంత భాగం ఛార్జీలు ఉంటాయి. ఈ రుణాలపై కంటే వడ్డీ రేటు ప్రస్తుత రుణం కంటే ఎక్కువగా ఉంటుంది.

ఇలా ఎన్ని చేసుకోవచ్చు?

పైన చెప్పిన అర్హతలు ఉన్నట్లయితే రుణ స్వీకర్తలు ఒకటి కంటే ఎక్కువ రుణాలను పునర్​వ్యవస్థీకరణ చేసుకోవచ్చు. రుణానికి సంబంధించి బ్యాంకుల లేదా ఫైనాన్స్ సంస్థలను సంప్రదించి తిరిగి చెల్లించే షెడ్యూల్ తదితర విషయాలపై స్పష్టత పొందవచ్చు.

మారటోరియంలో లేకుండా చేసుకోవచ్చా?

రిజర్వు బ్యాంకు అనుమతిచ్చిన ఆరు నెలల మారటోరియం తీసుకోనివారు కూడా పునర్​వ్యవస్థీకరణ చేసుకోవచ్చు.

ఈ ప్రక్రియను ఎలా ప్రారంభించాలి?

కొవిడ్ మూలంగా రుణాన్ని తిరిగి చెల్లించే క్రమంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పునర్ వ్యవస్థీకరణ కోసం 2020 డిసెంబర్ 30లోపు రుణ దాతలను సంప్రదించాలి.

రుణ పునర్​వ్యవస్థీకరణ కోసం వేతన జీవులైతే పే స్లిప్​లను, స్వయం ఉపాధి పొందే వారైతే లాభ నష్టాలకు సంబంధించిన ఖాతా స్టేట్​మెంట్​ తదితరాలను సమర్పించాలి. వీటన్నింటిని తనిఖీ చేసిన అనంతరం 90 రోజులు లోపు బ్యాంకులు పునర్ వ్యవస్థీకరణపై నిర్ణయం తీసుకుంటాయి.

పునర్ వ్యవస్థీకరణ తర్వాత షెడ్యూల్ ప్రకారం వాయిదా చెల్లించినట్లైతే రుణం స్టాండర్డ్ విభాగంలోనే ఉంటుంది.

క్రెడిట్ స్కోరుపై ఏమైనా ప్రభావం ఉంటుందా?

రుణానికి సంబంధించి పునర్ వ్యవస్థీకరణ చేసినట్లుగా క్రెడిట్ రిపోర్టులో నమోదవుతుంది. దీని వల్ల క్రెడిట్ స్కోరుపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ పరిణామం వల్ల భవిష్యత్తులో మరో రుణం లేదా క్రెడిట్ కార్డు పొందటం కష్టమయ్యే అవకాశం ఉంటుంది. కనీసం పునర్ వ్యవస్థీకరణ చేసిన రుణం తిరిగి చెల్లించే వరకైనా ఈ ప్రభావం కనిపిస్తుంది.

మరిన్ని విషయాలు?

పునర్ వ్యవస్థీకరణ ద్వారా ప్రస్తుతం ఉపశమనం పొందినప్పటికీ, భవిష్యత్తులో సమస్యగా మారే ప్రమాదం ఉంటుంది. పునర్ వ్యవస్థీకరణ తర్వాత ఒక వాయిదా తప్పినా కూడా మొదటి నెల నుంచే బ్యాంకులు వెంట పడే ఆస్కారం ఉంటుంది. పలు సార్లు వాయిదా చెల్లించనట్లైతే రుణ ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఇది మొత్తంగా క్రెడిట్ ప్రొఫైల్​పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపెడుతుంది.

రుణానికి సంబంధించి ఉంచిన తనఖా కూడా రుణ స్వీకర్త కోల్పోయే ప్రమాదం ఉంటుంది. సహా-దరఖాస్తుదారులు, గ్యారంటీ ఇచ్చిన వారి క్రెడిట్ ప్రొఫైల్ మీదా తీవ్ర ప్రభావం ఉంటుంది.

అంతిమంగా పునర్ వ్యవస్థీకరణ చేసుకోవాలా? వద్దా?

తప్పనిసరి అయితేనే పునర్​వ్యవస్థీకరణ చేసుకోవాలి. కొవిడ్ వల్ల వాస్తవంగా ఆదాయం తగ్గిపోయిన వారు మాత్రమే ఈ చర్య తీసుకోవాలి. పొదుపు చేసుకున్న మొత్తం ఉన్న వారు, ఆర్థిక పరిస్థితి మంచి స్థాయిలో ఉన్న వారు రుణ వాయిదాలను సాధారణంగానే చెల్లించాలి. రుణాన్ని చెల్లించలేని పరిస్థితులలో ఉన్న వారు మాత్రమే పునర్​వ్యవస్థీకరణ చేసుకోవాలి.

ఇదీ చూడండి: 'మారటోరియంలో వడ్డీ'పై నేడు సుప్రీం విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.