ప్రముఖ ఆరోగ్య ఉత్పత్తుల తయారీ సంస్థ, అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్(johnson and johnson headquarters) రెండు కంపెనీలుగా విడిపోతున్నట్లు(j&j split) ప్రకటించింది. పూర్తి వివరాలను కంపెనీ వెల్లడించనప్పటికీ.. రాబోయే రెండేళ్లలో ఈ విభజన జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది.
అయితే.. బ్యాండ్ ఎయిడ్లు, లిస్ట్రిన్‌లను విక్రయించే విభాగాన్ని కంపెనీకే చెందిన ఆరోగ్య ఉత్పత్తుల(j and j products) వ్యాపారం నుంచి విడదీస్తున్నట్లు ప్రకటించింది. ప్రిస్క్రిప్షన్ మందులు, వైద్య పరికరాలను విక్రయించే కంపెనీ పేరు జాన్సన్ అండ్ జాన్సన్‌గా(johnson and johnson company) ఉంటుందని కంపెనీ తెలిపింది. దీనితో తమ ఆదాయం(johnson and johnson net worth) సంవత్సరానికి సుమారు 15 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉన్నట్లు కంపెనీ అంచనా వేస్తోంది.
"వినియోగదారులకు, ఆరోగ్య సంరక్షణ నిపుణులకు సేవ చేసేందుకు, నిపుణులైన మా ఉత్పత్తి బృందానికి విస్తృత అవకాశాలను సృష్టిస్తూ.. మరింత వృద్ధిని సాధించేందుకు ఈ నిర్ణయం తోడ్పడుతుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా వినియోగదారులకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను అందించగలమని భావిస్తున్నాం."
---అలెక్స్ గోర్స్కీ, జె అండ్ జె సీఈఓ
బోర్డు ఆమోదిస్తే.. రాబోయే రెండేళ్లలో ఈ విభజన ప్రక్రియ(j&j split) విజయవంతంగా పూర్తవుతుందని కంపెనీ భావిస్తోంది. న్యూట్రోజెనా, అవీనో, టైలెనాల్, లిస్ట్రిన్, బ్యాండ్ ఎయిడ్(j&j band aid) వంటి బ్రాండ్‌లను కలిగి ఉన్న ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో కార్యకలాపాలు(johnson and johnson pharmaceutical products) సాగిస్తోంది.
మూడు వేర్వేరు కంపెనీలుగా విడిపోవాలని యోచిస్తున్నట్లు అమెరికాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ 'జనరల్ ఎలక్ట్రిక్' ప్రకటించిన కొద్ది రోజులకే జె అండ్ జె నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం.
ఇవీ చదవండి: