2017-18 ఎన్ఎస్ఎస్ అంచనాల ప్రకారం దేశంలో నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్టానికి చేరిందని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. వీటిని ఆధారంగా చేసుకుని కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు భాజపా సర్కారు పై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. ఎన్ఎస్ఎస్ఓ లెక్కల ప్రకారం 2011-12 నాటికి నిరుద్యోగ రేటు 2.2 శాతంగా ఉందని జాతీయ మీడియా కథనాలు వెలువరించింది.
భాజపా అధికారం చేపట్టినప్పుడు రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని, కానీ ఎన్ఎస్ఎస్ఓ లెక్కలు చూస్తే పరిస్థితి దారుణంగా ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ వ్యాఖ్యానించారు.
ఈ అంశంపై నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ స్పందించారు.
ఎన్ఎస్ఎస్ ఓ నివేదిక పూర్తి కాలేదు, అది డ్రాఫ్ట్ మాత్రమే . ఉద్యోగ కల్పన లేకుండా ప్రభుత్వం 7 శాతం వృద్ధి సాధించడం అసాధ్యం.- రాజీవ్ , నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు
నీతి ఆయోగ్ ప్రధాన కార్యదర్శి అమితాబ్ కాంత్ ఈ అంశం పై మాట్లాడుతూ...
దేశంలో ఉద్యోగ కల్పన బాగానే ఉంది, ప్రతి సంవత్సరం నీతి ఆయోగ్ అంచనాల ప్రకారం 7 - 7.8 మిలియన్ల ఉద్యోగాల కల్పన జరుగుతోంది- అమితాబ్ కాంత్ నీతి ఆయోగ్ ప్రధాన కార్యదర్శి.
ఈ ఎన్ఎస్ఎస్ఓ నివేదిక 2017 జూలై నుంచి 2018 జూన్ మధ్య సేకరించిన సమాచారం ఆధారంగా రూపొందించినదిగా పలు మీడియాల్లో కథనాలు వచ్చాయి. వీటి ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం రేటు అధికంగా ఉన్నట్లు పేర్కొన్నాయి. వాస్తవానికి ఎన్ఎస్ఎస్ఓ నివేదిక డిసెంబర్ 2018 నాడే విడుదల కావాల్సింది.