ETV Bharat / briefs

చంద్రబాబు హామీలకు మళ్లీ మోసపోవద్దు: జగన్

author img

By

Published : Apr 8, 2019, 5:16 PM IST

Updated : Apr 8, 2019, 7:06 PM IST

నెరవేరని హామీలతో ప్రజలను ప్రలోభపెట్టడానికి చంద్రబాబు మళ్లీ ప్రయత్నిస్తున్నారని వైకాపా అధ్యక్షుడు జగన్ ఆరోపించారు. తెదేపా మోసపూరిత హామీలు నమ్మవద్దన్న జగన్... వైకాపా అవినీతిలేని పాలన అందిస్తుందన్నారు.

రోడ్ షో లో వైకాపా అధ్యక్షుడు జగన్

ఐదేళ్ల చంద్రబాబు పాలన రాష్ట్రాన్ని అవినీతికూపంగా మార్చేసిందని వైకాపా అధినేత జగన్​మోహన్ రెడ్డి ఆరోపించారు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో పర్యటించిన ఆయన తెదేపా పాలనపై విమర్శలు చేశారు. ప్రజాసంకల్ప పాదయాత్ర ఏలూరు మీదుగా సాగిందని గుర్తు చేసిన జగన్​.. ఆ రోజున ప్రజలు తనకు చెప్పుకున్న సమస్యలను తొందరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

రోడ్ షో లో వైకాపా అధ్యక్షుడు జగన్

ఏలూరు రోడ్ షో లో జగన్

పేదవారి కోసం కట్టించే ఇళ్ల నిర్మాణాలలో భారీగా అవినీతి జరిగిందని వైకాపా అధినేత ఆరోపించారు. మూడు లక్షల రూపాయల విలువ చేయని ఇళ్లను పేదవారికి 6 లక్షలకు అమ్ముతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం లక్షన్నర మాత్రమే ఇస్తున్నాయన్నారు. మిగిలిన అప్పును తీర్చడానికి సుదీర్ఘకాలం పడుతుందన్నారు.

అధికారంలోకి రాగానే ఏలూరులో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చే ప్రణాళికలను రూపొందిస్తామన్నారు. డ్రైనేజీ వ్యవస్థను బాగు చేసేందుకు వైయస్ రాజశేఖర్ రెడ్డి హయంలో నిధులు మంజూరైనా తెదేపా నేతలు ఆ నిధులను దుర్వినియోగం చేశారన్నారు.

"2014లో చంద్రబాబు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీ అయినా నెరవేరిందా అని ప్రశ్నిస్తున్నా? రుణమాఫీ, ఇళ్ల నిర్మాణం, పోలీసు వ్యవస్థ పటిష్ఠ, ఇంటికో ఉద్యోగం..ఇలాంటి హామీలతో 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. మళ్లీ తిరిగి అవే హామీలతో చంద్రబాబును ప్రచారానికి వస్తున్నారు" ---వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్

మద్యం, డబ్బులతో ఓట్లను కొనాలని ప్రయత్నిస్తున్న తెదేపా నేతలను తరిమికొట్టాలని జగన్ అన్నారు. అధికారంలోకి రాగానే అమ్మఒడి కార్యక్రమంతో సంవత్సరానికి రూ.15 వేలు వేస్తామన్నారు. అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాలను నాలుగు దశల్లో మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.

మచిలీపట్నం రోడ్ షో

వైకాపా అధికారంలోకి వస్తే మచిలీపట్నం ఓడరేవును కేవలం 4 వేల 800 ఎకరాల్లోనే నిర్మిస్తామని వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు. తెదేపా ప్రభుత్వం 33 వేల ఎకరాల్లో పోర్టు నిర్మాణానికి రాత్రికి రాత్రి నోటిఫికేషన్ ఇవ్వడం దారుణమైన చర్యగా జగన్ అభివర్ణించారు. ఈ నిర్ణయంతో రైతులు, పేదలు తమ పొలాలను అమ్ముకోలేక అవస్థలు పడుతున్నారని జగన్ ఆరోపించారు.

"రైతుల భూములు ప్రభుత్వం తీసుకోవడం అన్యాయం. అభివృద్ధి ఆటంకం లేకుండా, రైతులకు నష్టం కాకుండా మచిలీపట్నం పోర్టు నిర్మిస్తాం. కృష్టా జిల్లాను చంద్రబాబు నిర్లక్ష్యం చేశారు. మేము అధికారంలోకి రాగానే కృష్ణా జిల్లా రైతులను ఆదుకునే ప్రణాళిక రూపొందిస్తాం "----వైకాపా అధినేత వైఎస్ జగన్.

ఇవీ చూడండి : వీవీ ప్యాట్లు లెక్కించకపోతే.. ప్రజాస్వామ్యానికే ప్రమాదం: సీఎం

Intro:ap_tpt_51_08_music_directer_koti_avb_C8

పలమనేరు జనసేన కార్యాలయం లో సంగీత దర్శకుడు కోటి

Body:ప్రముఖ సంగీత దర్శకుడు కోటి సోమవారం పలమనేరులోని జనసేన కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఈ టీవీ భారత్ తో కాసేపు మాట్లాడారు. పలమనేరు తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, ఇక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉండి తనకు చాలా బాగా నచ్చుతుంది అని చెప్పారు. అలాగే జనసేన పార్టీ పలమనేరు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పోలూరి శ్రీకాంత్ నాయుడు తనకు చాలా బాగా కావాల్సిన వ్యక్తి అని, ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో విదేశాల్లో చేస్తున్న ఉద్యోగాన్ని కూడా వదిలి ఆయన ఇక్కడ వచ్చారని చెప్పారు. ఆయన కుటుంబంతో కూడా తనకు మంచి అనుబంధం ఉందని, వ్యక్తిగా శ్రీకాంత్ నాయుడు చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం కలవాడని ఆయన వివరించారు. పలమనేరులో గతంలో ఎంతో మంది మహా నాయకులు శాసనసభ అభ్యర్థులు గా ఎన్నికయి ఎంతో అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. ఉన్నత విద్యావంతులైన శ్రీకాంత్ నాయుడు అధికారంలోకి వస్తే పలమనేరులో అభివృద్ధి పనులు పరుగులు తీస్తాయని, ప్రజలందరికీ మౌలిక సదుపాయాలు, ఇతర సౌకర్యాలు అన్నీ కలుగుతాయని, కాబట్టి ప్రజలందరూ తప్పకుండా గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి జనసేన పార్టీని, జనసేన అభ్యర్థిని గెలిపించుకోవాలని కోరారు.

Conclusion:ఈ సందర్భంగా ఆయన పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని గొబ్బిళ్ల కోటూరు గ్రామంలో ఇంటింటికి తిరిగి జనసేన తరపున ప్రచారం నిర్వహించారు. ఆయన వెంట జనసేన నియోజకవర్గ శాసన సభ అభ్యర్థి పోలూరి శ్రీకాంత్ నాయుడు ఉన్నారు.

రోషన్
పలమనేరు
ఈటీవీ భారత్ ప్రతినిధి
79 9 3 3 0 0 4 9 1
Last Updated : Apr 8, 2019, 7:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.