తెలుగుదేశం పార్టీ 135 స్థానాల్లో విజయం సాధిస్తుందని... ఆ పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధీమా వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన... ప్రజలు తెదేపాను ఆదరిస్తారని అన్నారు. 1994 తర్వాత తెదేపా అంతటి విజయం సాధించడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణలో కమిషన్ ఘోరంగా విఫలమైందని ఆక్షేపించారు. ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్ జగన్ ఇకపై ఏ ఎన్నికల్లో పోటీ చేయరని...ఆయన జైలుకెళ్లడం ఖాయమని గోరంట్ల జోస్యం చెప్పారు.
ఇదీ చదవండి