ETV Bharat / briefs

అమెరికాతో ఒప్పందం చైనాకు అత్యవసరం :ట్రంప్​ - america

అమెరికాతో ఒప్పందం చైనాకు తప్పనిసరని అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ వ్యాఖ్యానించారు. డ్రాగన్ దేశం​ అందుకు సుముఖంగా ఉంటే వాణిజ్య చర్చల గడువు పొడగించే అవకాశం ఉందని తెలిపారు ట్రంప్.

జిన్​పింగ్, ట్రంప్
author img

By

Published : Feb 13, 2019, 11:35 AM IST

బీజింగ్​లో చైనాతో అమెరికా ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం చర్చలు జరుపుతున్న నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం డ్రాగన్​ దేశానికి అత్యవసరమని ట్రంప్​ అన్నారు.

"చైనాతో పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. ఇప్పుడు అమెరికాతో ఒప్పందం చైనాకు అత్యవసరం. అయితే అది పూర్తి స్థాయి ఒప్పందమే కావాలని మేము కోరుకుంటున్నాం. అందుకు చైనా సుముఖంగా ఉంటే వాణిజ్య చర్చల గడువు పొడగించేందుకు మేం సిద్ధమే. కానీ ఇప్పట్లో చైనా అధ్యక్షుడు షి జిన్​పింగ్​ను కలిసే అవకాశం లేదు."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

ప్రపంచవ్యాప్తంగా చైనా స్టాక్​ మార్కెట్ల పరిస్థితి దయనీయంగా ఉందని ట్రంప్​ అన్నారు. చైనాకు ఎన్నో రాయితీలు కల్పించామనీ, అందుకు ప్రతిగా చైనా తమకేమి చేయలేదని ట్రంప్ ఆరోపించారు. చైనాతో అమెరికా బృందం చర్చలు జరుపుతోందని, ఏం జరుగుతుందో చూద్దామంటూ వ్యాఖ్యానించారు. సుంకం పెంపుతో అమెరికా ఖజానాలో అధికంగా డబ్బు వచ్చి చేరుతోందని వివరించారు ట్రంప్. సుంకం విధింపుతో చైనా ఆర్థికంగా కుంగిపోయిందని తెలిపారు.

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చించేందుకు అమెరికా ప్రతినిధి రాబర్ట్ లైతిజర్​ నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందం బీజింగ్​లో పర్యటిస్తోంది. ద్వైపాక్షిక వాణిజ్య లోటు, మేధోసంపత్తి దోపిడి, అమెరికా కంపెనీల మూసివేత వంటి అంశాలను ప్రముఖంగా ఒప్పందంలో ఉండేలా ఈ బృందం కృషి చేస్తోంది.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.