ETV Bharat / briefs

13 నుంచి ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. 18న కల్యాణం - తితిదే

వార్షిక సంవత్సర ముగింపుతో శ్రీవారి ఆదాయ వివరాలు తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటించారు. గతేడాదిలో రూ. 1214 కోట్లు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఏప్రిల్ 13 నుంచి ప్రారంభమయ్యే ఒంటిమిట్ట కోదండస్వామి బ్రహ్మోత్సవాలకు... విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్
author img

By

Published : Apr 5, 2019, 2:28 PM IST

తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్

కడప జిల్లా ఒంటిమిట్ల కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాల నిర్వహణకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. గతంలో జరిగిన కొన్ని ఘటనలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా చూస్తామని సింఘాల్ అన్నారు. ఏప్రిల్ 13 నుంచి 21వ తేదీ వరకు జరిగే ఈ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఉత్సవాల సమయంలో రోజుకు లక్ష మంది భక్తులు వచ్చినా.. ఎలాంటి ఇబ్బింది లేకుండా సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. భక్తుల వసతి, అన్నప్రసాదాలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.

శ్రీవారి వార్షికాదాయం వివరాలను ఈవో సింఘాల్ ప్రకటించారు. 2018-19 సంవత్సరానికి రూ. 507 కోట్ల రూపాయల మొత్తానికి ఫిక్స్​డ్ డిపాజిట్లు చేశామని అనిల్ సింఘాల్ చెప్పారు. భక్తుల నుంచి అన్నప్రసాద ట్రస్టుకు రూ.140 కోట్లు, ప్రాణదానం ట్రస్టుకు రూ. 18 కోట్లు, గోసంరక్షణకు రూ.20 కోట్లు, బర్డ్ ట్రస్టుకు రూ. 21 కోట్లు విరాళాలు వచ్చాయన్నారు. 2018-19 వార్షిక సంవత్సరంలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.1214 కోట్లుగా వెల్లడించారు.

ఏప్రిల్ నెలలో జరిగే శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు, వరాహస్వామి మహా సంప్రోక్షణ ఏర్పాటు జరుగుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తితిదే కల్యాణ మండపాల్లో ఆన్ లైన్ బుకింగ్ ప్రారంభించినట్లు ఈవో చెప్పారు.

ఇవీ చూడండి : తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.