- 'నెల్లూరు ఆయుర్వేద ఔషధంపై శాస్త్రీయ నిర్ధారణ చేయించండి'
నెల్లూరు ఆయుర్వేదం ఔషదంపై శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని సీఎం జగన్ సూచించారు. నెల్లూరుకు ఐసీఎంఆర్ బృందాన్ని పంపాలని సీఎం జగన్ నిర్ణయించారు. సాయంత్రానికి ఐసీఎంఆర్ బృందం నెల్లూరు వెళ్లే అవకాశం ఉందని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆస్పత్రికి తీసుకెళ్లేముందు ఎంపీ రఘురామ గాయాలు చేసుకున్నారా ?: సుప్రీం
ఎంపీ రఘురామ బెయిల్, వైద్య పరీక్షలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వైద్య పరీక్షలపై ఆర్మీ ఆస్పత్రి వైద్యులు ఇచ్చిన నివేదిక సుప్రీం కోర్టుకు అందింది. ముగ్గురు వైద్యులు పరీక్షించిన ఎక్స్-రే, వీడియో కూడా పంపారు. నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు.. జనరల్ ఎడిమా, ఫ్రాక్చర్ కూడా ఉన్నట్లు నివేదికలో తేలిందన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కరోనా ఆయుర్వేద మందు కోసం పోటెత్తిన జనం..ప్రారంభమైన కాసేపటికే నిలిపివేత
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా చికిత్సకు ఆయుర్వేదం కోసం జనం పోటెత్తారు. పెద్దసంఖ్యలో వాహనాలపై తరలి రావటంతో..ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. గందరగోళ పరిస్థితుల్లో ఇవాళ్టికి మందుల పంపిణీ నిలిపివేసినట్లు పోలీసుల ప్రకటించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- టీఎంసీ ఎమ్మెల్యే రాజీనామా- మమత కోసమేనా?
బంగాల్ మంత్రి, సీనియర్ నేత సోభన్దేవ్ చటోపాధ్యాయ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవలి ఎన్నికల్లో భవానీపుర్ నుంచి ఆయన పోటీచేసి గెలిచారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మరో రాష్ట్రంలో 'వైట్ ఫంగస్' కలకలం
హరియాణాలోని హిసార్ సివిల్ ఆస్పత్రిలో ఇద్దరు మహిళలకు 'వైట్ ఫంగస్' సోకినట్లుగా నిర్ధరణ అయింది. వారిద్దరినీ ఐసొలేషన్ వార్డుకు తరలించి యాంటీ ఫంగల్ చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పుట్టినరోజు వేడుకల్లో తుపాకులతో బందిపోట్ల హల్చల్!
పుట్టినరోజు వేడుకల్లో తుపాకులు పట్టుకుని బందిపోటు ముఠాలు హల్చల్ చేశాయి. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తూ వందలాది మంది గుమికూడారు. మధ్యప్రదేశ్‌లోని భిండ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పర్యావరణ ఉద్యమకారుడు బహుగుణ మృతి
ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సుందర్‌లాల్ బహుగుణ(94) కరోనాతో మరణించారు. మే 8న వైరస్ బారినపడి ఎయిమ్స్‌లో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు..పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇజ్రాయెల్-హమాస్ డీల్ వెనుక బైడెన్ స్కెచ్!
ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణ సమయంలో జో బైడెన్-నెతన్యాహుల మధ్య సమన్వయం మరోసారి బయటపడింది. గాజాలోని హమాస్‌తో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ మంత్రివర్గం ఆమోదం తెలపడం వెనుక అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక పాత్ర పోషించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'జడేజా పేసర్ అయితే కలిసి ఆడేవాళ్లం'
ఒకప్పుడు టీమ్ఇండియాకు ఎన్నో విజయాలు అందించిన స్పిన్ ద్వయం కుల్దీప్, చాహల్.. ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్లో కలిసి ఆడేందుకు అవకాశం రావడం లేదు. దీనికి కారణం స్టార్ ఆల్ రౌండర్ జడేజా స్పిన్నర్ కావడమేనని అంటున్నాడు చాహల్.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పొన్నాంబళం కిడ్నీ ఆపరేషన్‌కు మెగాస్టార్ సాయం
పలు చిత్రాల్లో విలన్‌గా నటించి మెప్పించిన పొన్నాంబళం కిడ్నీ ఆపరేషన్‌కు రూ.2 లక్షలు సాయం చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ విషయాన్ని పొన్నాంబళం వీడియో సందేశం ద్వారా తెలిపారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.