- ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ రద్దుచేస్తూ హైకోర్టు తీర్పు
రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది. పోలింగ్‌కు 4 వారాలకు ముందు నోటిఫికేషన్ ఇవ్వాలన్న సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఎన్నికలు జరపలేదని హైకోర్టు ఆక్షేపించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కరోనా ఆయుర్వేద మందు పంపిణీకి అనుమతిపై కాసేపట్లో సీఎం సమీక్ష
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా చికిత్సకు ఆయుర్వేదం కోసం జనం పోటెత్తారు. పెద్దసంఖ్యలో వాహనాలపై తరలి రావటంతో..ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. . ఆయుర్వేద మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలా ? వద్దా ? అన్న అంశంపై ముఖ్యమంత్రి జగన్ దృష్టి సారించారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై సమీక్ష నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'హైకోర్టు తీర్పు వైకాపా రాక్షస పాలనకు చెంపపెట్టు'
పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టని అభిప్రాయం వ్యక్తం చేశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'కరోనా కట్టడిలో వారణాసి భేష్'
కరోనా కట్టడిలో ఉత్తర్‌ప్రదేశ్ వారణాసి నగరం.. గొప్ప ఉదాహరణగా నిలిచిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తక్కువ సమయంలోనే పీటీ రాజన్ మిశ్రా ఆస్పత్రిని నిర్మించడాన్ని అభినందించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కాంగ్రెస్ టూల్‌కిట్ వ్యవహారంపై స్పందించిన ట్విట్టర్
కాంగ్రెస్ టూల్‌కిట్ రగడలో ట్విట్టర్ జోక్యం చేసుకుంది. భాజపా నేత సంబిత్ పాత్రా చేసిన ట్వీట్లు అవాస్తం అని పేర్కొంది. అవాస్తవమైన వీడియోలు, ఆడియోలు, ఫొటోలను ట్విట్ చేస్తే చర్యలు చేపడతామని ట్విట్టర్ స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అత్యాచారం కేసులో తేజ్‌పాల్‌ను నిర్దోషిగా తేల్చిన కోర్టు
సహోద్యోగిపై లైంగిక దాడి, అత్యాచారం కేసులో తెహెల్కా మేగజైన్ వ్యవస్థాపకుడు తరుణ్ తేజ్‌పాల్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ గోవాలోని జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు వెల్లడించింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇజ్రాయెల్ కాల్పుల విరమణపై ప్రపంచ నేతల హర్షం
గాజాలోని హమాస్‌తో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ మంత్రివర్గం ఆమోదం తెలపడంపై ప్రపంచ దేశాల నేతలు స్వాగతించారు. కాల్పుల విరమణకు ఇరు పక్షాలు కట్టుడి ఉండాలని కోరుతున్నారు. శాంతిని నెలకొల్పేందుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'రెండు డోసులతో 'ఆస్ట్రాజెనెకా' సామర్థ్యం 90శాతం'
ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ రెండు డోసుల సమర్థత 85-90 శాతంగా ఉందని ఇంగ్లాండ్ ప్రజా ఆరోగ్య విభాగం ప్రకటించింది. 60 ఏళ్లపైబడిన వారిలో సుమారు 13వేల మరణాలను నిరోధించిందని పేర్కొంది. ఈ మేరకు వ్యాక్సిన్ తీసుకున్న వారిపై అధ్యయనం చేసి వారం నివేదికను విడుదల చేసింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బీసీసీఐ ఎలాంటి విజ్ఞప్తి చేయలేదు: ఈసీబీ
టెస్టు సిరీస్ లో మార్పుల కోసం బీసీసీఐ తమకు అధికారికంగా విజ్ఞప్తి చేయలేదని స్పష్టంచేసింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. దీంతో షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్ లు జరుపుతామని తెలిపింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'వ్యాన్ లైఫ్' ఇప్పుడు మొదలైంది కాదు: పూరి
'పూరీ మ్యూజింగ్స్'తో పలు రకాల విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్. తాజాగా 'వ్యాన్ లైఫ్' అనే అంశం గురించి వివరించారు..పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.