రోజుకురోజుకూ భానుడి ప్రతాపం తీవ్రమవుతోంది. రాష్ట్రంలో మే నెలలో సగటున 41 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్జీజీఎస్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎండ వేడిమి తక్కువగా ఉన్న సమయాల్లోనే బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో గరిష్ఠంగా 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది.
నేటి ఉష్ణోగ్రతల వివరాలు
గుంటూరు జిల్లా పెద్దకూరపాడు, ప్రకాశం జిల్లా రాళ్లపల్లిలో గరిష్ఠంగా 44.57 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో 69 ప్రాంతాల్లో 43 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉన్నాయి.
ఇవీ చదవండి...
ఈ విజయం ఊహించిందే: మోహన్‌బాబు