లోక్సభ నియోజకవర్గాల నేతలతో నిర్వహిస్తున్న ఎన్నికల సమీక్షలను రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. ఎన్నికల కౌంటింగ్ దగ్గర పడుతున్న కారణంగా పార్లమెంటరీ స్థాయి సమీక్షలను రద్దు చేసుకోవాలని నిర్ణయించారు.
పార్లమెంట్ నియోజకవర్గాల్లో కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలని తెదేపా నిర్ణయం తీసుకుంది. ఏజెంట్లకు నాలుగు రోజుల పాటు శిక్షణ ఇచ్చి.. ఆ జాబితాను రిటర్నింగ్ అధికారులకు పంపనున్నారు. ఫలితాల లెక్కింపులో ఏజెంట్ల పాత్ర కీలకమైనందున వారంతా అప్రమత్తంగా వ్యవహరించేందుకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాలకు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు హాజరై ఏజెంట్లకు శిక్షణ ఇవ్వనున్నారు.
రాజమండ్రి పార్లమెంట్ స్థానంతో లోక్సభ నియోజకవర్గాల సమీక్షలను తెదేపా అధినేత చంద్రబాబు ప్రారంభించారు. ఈ నెల 22 వరకూ వీటిని చేపట్టాలని భావించినా...కౌటింగ్ దృష్ట్యా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.