ఇవీ చదవండి..సమరాంధ్ర @ 2019.. 'కృష్ణా' యుద్ధంలో పోటీ పడేది వీరే!
రాష్ట్ర ఎన్నికల అధికారులతో కె.కె. శర్మ భేటీ - ec
కేంద్ర ఎన్నికల సంఘం పోలీసు ప్రత్యేక పరిశీలకుడు కె.కె శర్మ అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, శాంతి భద్రతల అంశంపై చర్చించారు.
రాష్ట్ర ఎన్నికల అధికారులతో కే.కే. శర్మ భేటీ
రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ప్రచారం, శాంతిభద్రతల అంశంపై ఎన్నికల అధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక పోలీసు పరిశీలకుడు కె.కె.శర్మ భేటీ అయ్యారు. విజయవాడ నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో రాష్ట్రఎన్నికల ప్రధానాధికారి సహా... పోలీసు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులనుద్వివేది ఆయనకు వివరించారు. ఏపీని వ్యయపరంగా అత్యంత సునిశితమైన ప్రాంతంగా ఈసీ ప్రకటించినందున..ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. మరో రెండు, మూడు రోజుల్లోనే మరింత మంది ప్రత్యేక వ్యయపరిశీలకులు కూడా రాష్ట్రానికి రానున్నారు. రాజకీయ పరంగా అత్యంత సమస్యాత్మకంగా చాలా నియోజకవర్గాలు ఉన్నట్టు ఈసీ పరిశీలనలో తేలింది.ఆ ప్రాంతాల్లో శాంతిభద్రతలు, ఎన్నికల నిర్వహణ, బందోబస్తు ఏర్పాట్లు తదితర అంశాలను శర్మ పర్యవేక్షిస్తున్నారు. పలురాజకీయ పార్టీల ప్రతినిధులతోనూ ఆయనభేటీ అయ్యారు.
ఇవీ చదవండి..సమరాంధ్ర @ 2019.. 'కృష్ణా' యుద్ధంలో పోటీ పడేది వీరే!