ETV Bharat / briefs

శిక్షణ కోసం వెళ్తే... లైంగికంగా వేధించాడు - శిక్షణ కోసం వెళ్తే... లైంగికంగా వేధించాడు

మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలంటారు. వాళ్లు ఆసక్తితో నచ్చిన రంగంలోకి వస్తే... కామాంధులు వేధింపులకు గురి చేస్తున్నారు. ఓ యువతి నటనలో శిక్షణ కోసం యాక్టింగ్​ స్కూల్​లో చేరితే... అక్కడి డైరెక్టర్​ ఆమెను లైంగికంగా వేధించాడు. కుదరదు అంటే... ఇనిస్టిట్యూట్​ నుంచి వెళ్లి పోవాలని బెదిరించాడు. ఈ ఘటన హైదరాబాద్​లో చోటు చేసుకుంది.

abc
author img

By

Published : Apr 17, 2019, 5:36 PM IST

శిక్షణ కోసం వెళ్తే... లైంగికంగా వేధించాడు

ఇప్పుడిప్పుడే అన్ని రంగాల్లో అడుగెడుతున్న అతివలకు ఇటువంటి దుర్మార్గుల వల్ల ఆడవాళ్లు మళ్లీ వంటింటికి పరిమితమయ్యే అవకాశం ఉంది. అతివలు నచ్చిన రంగంలోకి అడుగుపెడితే... వారి అడుగులకు అడ్డుగా నిలుస్తూ వేధిస్తున్నారు కొందరు కామాంధులు.

అసలేం జరిగిందంటే...

అచిత్​ కౌర్ అనే అమ్మాయి​... నటన మీద ఆసక్తితో హైదరాబాద్​ హిమాయాత్​ నగర్​లోని సూత్రదార్​ థియేటర్​ స్కూల్​లో శిక్షణ కోసం చేరింది. డైరెక్టర్​ వినయ్​ వర్మ... ఆమెను ప్రతిరోజు లైంగికంగా వేధిస్తున్నాడని బాధితురాలు చెప్పింది. ఏప్రిల్​ 3న ఉదయం థియేటర్​కు వెళ్తే గది తలుపులు మూసి వస్త్రాలు విప్పివేయాలని చెప్పినట్లు ఆ యువతి ఆరోపించారు. లేకుంటే... ఇక ఇనిస్టిట్యూట్​కు రావద్దని డైరెక్టర్​ ఆదేశించారని బాధపడుతూ చెప్పింది.

అప్పటికే శిక్షణ కోసం 25వేలు కట్టిన ఆమె... న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు సానుకూలంగా స్పందిస్తున్నారు తప్ప డైరెక్టర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన చెందారు. ఇలాంటి వేధింపులకు మరో యువతి బలిపశువు కాకూడదనే ఉద్దేశంతోనే మీడియా ముందుకు వచ్చినట్లు బాధిత యువతి పేర్కొన్నారు. తన కూతురుకు జరిగిన అవమానం మరో అమ్మాయికి జరగవద్దని...వినయ్‌ వర్మను శిక్షించాలని బాధితురాలి తండ్రి దిల్‌ప్రిత్‌ సింగ్‌ కోరారు.

ఇదీ చూడండి: గుట్టను గుడిగా మలిచిన ఒకే ఒక్కడు !

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.