రఫేల్ ఒప్పందంపై రాహుల్ చేస్తోన్న విమర్శలపై కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. దేశ భద్రతకు సంబంధించిన విషయాలపై బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారంటూ దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ రఫేల్‌పై అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు.
"రాహుల్ గాంధీకి రఫేల్ఫోబియా పట్టింది. ప్రధానికి వ్యతిరేకంగా రాహుల్ వాడుతోన్న భాష ఆక్షేపనీయం. తన తండ్రిపై బోఫోర్స్‌కు సంబంధించి ఎన్ని కేసులు ఉన్నాయి? ఇందిరాజీ అవినీతి రికార్డు సంగతేంటి? కానీ మేము రాహుల్ గాంధీలా అప్రజాస్వామిక భాషను ఉపయోగించట్లేదు. అబద్ధాలను బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. నెహ్రూ, పటేల్, రాజాజీ, కామరాజ్ లాంటి వారు అధ్యక్షుడిగా ఉన్న పార్టీకి రాహుల్ అధ్యక్షుడిగా ఉన్నారు. అలాంటి హోదాలో ఉండి ఇంత దిగజారుడు మాటలు మాట్లాడతారా..? రఫేల్ విమానాలు యూపీయే హయాంలో కొనుగోలు చేసినదానికన్నా 9శాతం చౌకగానే కొన్నాం."
-రవిశంకర్ ప్రసాద్, కేంద్ర న్యాయశాఖ మంత్రి