సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. గత రాత్రి నుంచి 48 మందిని కరిచి తీవ్రంగా గాయపరిచింది. పట్టణ పరిధిలోని కాలనీల్లో తిరుగుతూ దారిన పోయే వారినే కాకుండా ఇళ్లల్లో ఉన్నవారినీ కరిచింది. ఏమరుపాటుగా ఉన్న సమయంలో వెనుక నుంచి వచ్చి పిచ్చికుక్క దాడి చేసిందని బాధితులు వాపోయారు. స్థానికంగా కుక్కల భయం ఉందని.. పంచాయతీ సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. స్థానికులు పిచ్చికుక్కను కొట్టి చంపారు. ఇకనైనా పంచాయతీ అధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి తమను రక్షించాలని కోరారు.
వ్యాక్సిన్ కొరత లేదు
బాధితులు పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. చికిత్స అందిస్తున్నామని ఆస్పత్రి ఆర్ ఎం కిష్టయ్య తెలిపారు. రేబిస్ వ్యాక్సిన్ సరిపడా అందుబాటులో ఉందన్నారు.
ఇదీ చదవండి : ప్రేమ వేధింపులకు మరో యువతి బలి