పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన మామిడిశెట్టి నరసింహమూర్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. పట్టణంలోని శ్రీనివాస్ సెంటర్లో ఆర్ఎంపీ డాక్టర్‌గా పనిచేస్తోన్న నరసింహమూర్తికి పదిహేనేళ్ల క్రితం రాజేశ్వరితో వివాహమైంది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. నరసింహ మూర్తి ఆరేళ్ల క్రితం పట్టణానికి చెందిన స్వప్న మంజరి అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆమె వద్ద నరసింహమూర్తి ఉండటం వలన కుటుంబసభ్యుల్లో మనస్పర్ధలు పెరిగాయి. తమ చెల్లికి అన్యాయం జరిగిందని కృష్ణమూర్తిని హతమార్చాలని బావలు దూన బోయిన లక్ష్మీ నరసింహారావు, అతని తమ్ముడు లక్ష్మీనారాయణ పథకం ప్రకారం కుట్రపన్నారు. ఈ నెల 4న నరసింహమూర్తి ఇంటికి వెళ్లి తన చెల్లెలు రాజేశ్వరి ఆచూకీ తెలిసిందని ఆమెను తీసుకు వద్దాం రమ్మంటూ కారులో ఎక్కించుకుని పిఠాపురం బయలుదేరారు. వీరికి తోడుగా బంధువులైన క్రిష్ణమూర్తి, నాగ శివ, నాగేంద్రరావులను తీసుకుని వెళ్లారు. మార్గ మధ్యలో నరసింహ మూర్తిని కారులోనే గొంతు నులిమి చంపేసి గోని సంచులు కట్టి బిక్కవోలు- సామర్లకోట కెనాల్ రోడ్డులోని పక్కన పడేసి వెళ్లారు. ఈ సంఘటనపై స్వప్న మంజరి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయని నరసాపురం డీఎస్పీ తెలిపారు. మామిడిశెట్టి నరసింహ మూర్తికి హత్యకు పాల్పడిన లక్ష్మీ నరసింహారావు అతని తమ్ముడు లక్ష్మీనారాయణను బంధువులైన కృష్ణమూర్తి, నాగ శివ, నాగేంద్రలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండీ :