తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట ఎదుట ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఫలితాల్లో అవకతవకలకు నిరసనగా హైదరాబాద్ లోని నాంపల్లిలో ఉన్న బోర్డు కార్యాలయాన్ని ముట్టడించారు. గందరగోళానికి బాధ్యులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. ముందస్తు సమాచారం ఉన్న పోలీసులు.. కార్యాలయం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులు లోనికి వెళ్లేందుకు యత్నించగా వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఉద్యోగ సంఘాల నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
మరోసారి ఇంటర్ బోర్డ్ కార్యాలయం ముందు ఉద్రిక్తత - మరోసారి ఇంటర్ బోర్డ్ కార్యాలయం ముందు ఉద్రిక్తత
తెలంగాణ ఇంటర్ బోర్డ్ ముందు మరోసారి ఉద్రిక్తత ఏర్పడింది. ఇవాళ ప్రారంభమైన సప్లిమెంటర్ పరీక్షల్లో బోర్డు నిర్లక్ష్యంపై ఏబీవీపీ ఆందోళనకు దిగింది.