నంద్యాల ఉపఎన్నికల సమయంలో తనకు వంద కోట్ల రూపాయలు ఇస్తానన్నారని గూడురు శాసనసభ్యుడు వి.వరప్రసాద్ వ్యాఖ్యానించారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించిన వరప్రసాద్.. కడప జిల్లాకు చెందిన ఓ రాజ్యసభ సభ్యుడు ఈ మొత్తాన్ని ఇవ్వజూపారని ఆయన ఆరోపించారు. 50 కోట్ల రూపాయల నగదుతో పాటు మరో 50 కోట్ల రూపాయల నియోజకవర్గానికి నిధుల కింద ఇస్తామన్నారని ఆయన శాసనసభలో వెల్లడించారు. అయితే తాను ఏ ప్రలోభాలకూ లొంగలేదని..తల్లిలాంటి పార్టీని విడిచిరానని చెప్పానని స్పష్టంచేశారు.
'పార్టీ మారితే వంద కోట్లు ఇస్తానన్నారు' - gudur
2017 నంద్యాల ఉపఎన్నికల అనంతరం పార్టీ మారితే తనకు వంద కోట్లు ఇస్తానని తెదేపా నేతలు ఆశచూపారని గూడురు ఎమ్మెల్యే వరప్రసాద్ అన్నారు. శాసనసభలో మాట్లాడిన ఆయన ఓ రాజ్యసభ సభ్యుడు తనకు నగదు ఇచ్చేందుకు ప్రయత్నించారని, కానీ తాను తిరస్కరించానని స్పష్టం చేశారు.