ETV Bharat / briefs

'హైదరాబాద్​ నుంచి వైకాపాకు ప్రచార రథాలు పంపించారు'

ప్రత్యేక హోదా ఇస్తామని నాలుగేళ్లుగా మోదీ మోసం చేశారని మంత్రి లోకేశ్​ మండిపడ్డారు. ప్రధాని, కేసీఆర్​, జగన్​లు కలిసి రాష్ట్రాన్ని ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన చెందారు. విజయనగరం జిల్లా తెర్లాంలో జరిగిన తెదేపా బహిరంగ సభలో లోకేశ్​ మాట్లాడారు.

author img

By

Published : Mar 26, 2019, 9:28 PM IST

మంత్రి లోకేశ్​
విజయనగరం జిల్లా తెర్లాం సభలో లోకేశ్​
వైకాపా నేతలకు కేసీఆర్​ వెయ్యి కోట్లు అందజేశారని మంత్రి లోకేశ్​ విమర్శించారు. వైకాపా, భాజపా మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆరోపించారు. విజయనగరం జిల్లా తెర్లాం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. 'హైదరాబాద్​ నుంచి వైకాపా నేతలకు ప్రచార రథాలు పంపించారు. మోదీ, కేసీఆర్​, జగన్​ కలిసి ఏపీని ఇబ్బందులు పెడుతున్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని నాలుగేళ్లుగా మోదీ మోసం చేశారు. రాష్ట్ర విభజన కోరిన వారు అసూయపడేలా.. అభివృద్ధి చేస్తున్నాం. భావితరాల భవిష్యత్తు కోసమే సీఎం చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతున్నారు. పేదలకు నాణ్యమైన సామగ్రితో జీ ప్లస్​ త్రీ విధానంలో ఇళ్లు నిర్మిస్తున్నాం. ఇప్పటికీ 11 లక్షల గృహాలు పూర్తి చేశాం.' -- నారా లోకేశ్​.

ఇవీ చదవండీ...అనుభవజ్ఞుడు కావాలా.. 'నేరస్థుడు' కావాలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.