ETV Bharat / briefs

'ఎన్ని కుట్రలు చేసినా.. చంద్రబాబును అడ్డుకోలేరు' - ఈసీ

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నిర్వహణలో ఈసీ పూర్తిగా విఫలమయ్యిందని తెదేపా అధికార ప్రతినిధి లంకా దినకర్ ఆరోపించారు. వైకాపా, భాజపా చెప్పినట్లు ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని విమర్శించారు.

తెదేపా అధికార ప్రతినిధి లంకా దినకర్
author img

By

Published : Apr 19, 2019, 5:54 PM IST

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నిర్వహణలో ఈసీ పూర్తిగా విఫలమయ్యిందని తెదేపా అధికార ప్రతినిధి లంకా దినకర్ ఆరోపించారు. వైకాపా, భాజపా చెప్పినట్లు ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని విమర్శించారు.

ఈసీకి ప్రశ్నలు

తెదేపా అధికార ప్రతినిధి లంకా దినకర్

ఈవీఎంల మొరాయింపు ఈసీ వైఫల్యం కాదా అని దినకర్​ ప్రశ్నించారు. సిబ్బంది, బలగాలు సరిపోవని తెలిసినా... ఒకే దశలో ఎన్నికలు ఎందుకు నిర్వహించారని అడిగారు. కొన్ని కేంద్రాల్లో మాక్ పోలింగ్ ఓట్లను తొలగించకుండా ఓటింగ్ నిర్వహించారన్న ఆయన... అది ఈసీ వైఫల్యానికి కారణమేనన్నారు. వెయ్యి ఓట్లు దాటితే బూత్​ల సంఖ్య పెంచాలని నియమం ఉన్నా...ఈసీ పట్టించుకోలేదని లంకా ఆరోపించారు. సున్నితమైన ప్రదేశాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామన్న ఈసీ.. గొడవలు జరిగిన చోట వెబ్ కాస్టింగ్ ఎందుకు పని చేయలేదని ఆరోపించారు. ఎన్నికలు పూర్తయినా పార్టీల ఏజెంట్లకు ఫారం 17సి ఇప్పటికీ ఇవ్వలేదని ఆరోపించారు. స్ట్రాంగ్ రూముల భద్రతను ఆన్​లైన్​లో అభ్యర్థులు చూడొచ్చన్న ఈసీ...అభ్యర్థులకు ఆ సదుపాయం కల్పించడంలో విఫలమయ్యిందన్నారు.

వైకాపాపై ధ్వజం

తెదేపా అధికార ప్రతినిధి లంకా దినకర్

ఈవీఎంల మొరాయింపుపై మొదటిగా ఈసీ దృష్టికి తీసుకెళ్లింది చంద్రబాబేనని గుర్తు చేశారు లంకా దినకర్. భాజపాకు బ్రాంచ్ ఆఫీసుగా పనిచేస్తోన్న వైకాపా...తన సొంత పత్రికలో అసత్య వార్తలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కేసీఆర్​తో చేతులు కలిపి కుట్రపూరితంగా ఓటింగ్ శాతాన్ని తగ్గించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఫారం-7తో ఓట్లు తొలగించే ప్రయత్నం చేసిన వైకాపాకు ఈసీ అండగా నిలిచిందని విమర్శించారు. వైకాపాకు చెంపపెట్టుగా మహిళలు, వృద్ధులు అర్ధరాత్రి వరకు వేచి ఉండి మరీ ఓటు వేశారన్నారు. ఓటింగ్ శాతాన్ని తగ్గించేందుకు అన్ని విధాల ప్రయత్నించిన వైకాపా వ్యూహాలు తిప్పికొట్టారని లంకా అన్నారు.

వైకాపా, ఈసీ ఎన్ని కుట్రలు చేసినా తెలుగుదేశం విజయాన్ని అడ్డుకోలేరని లంకా దినకర్ స్పష్టం చేశారు. దేశ రాజకీయాల్లో చంద్రబాబు తిరుగులేని శక్తిగా మారబోతున్నారని వెల్లడించారు.

ఇవీ చూడండి : దాహం కేకలు... నాయుడుపేటలో నీటి కష్టాలు

Intro:యాంకర్ వాయిస్
తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో క్రీస్తు భక్తులు గుడ్ ఫ్రైడే ను ఘనంగా నిర్వహించారు పలు చర్చిల్లో ప్రభువైన యేసును కొలుస్తూ భక్తులు పూజలు ప్రార్థనలు చేశారు గ్రామాలలో సిలువ మార్గం నిర్వహించారు పి గన్నవరం పోతవరం అందాల పాలెం వీరవల్లిపాలెం అయినవిల్లి ఇలా వివిధ గ్రామాల్లో గుడ్ ఫ్రైడే భక్తిశ్రద్ధలతో జరిపారు

Body:గుడ్ ఫ్రైడే

Conclusion:చర్చిలు పూజలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.