ETV Bharat / briefs

కడుపులో కత్తెర

అనారోగ్యంతో దవాఖానాకు వెళ్తే కడుపులో కత్తెర పెట్టి కుట్లేశారు. హైదరాబాద్​లోని ప్రముఖ నిమ్స్ వైద్యుల ఘనకార్యమిది.

author img

By

Published : Feb 9, 2019, 12:28 PM IST

నిమ్స్​ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఓ మహిళకు ఆపరేషన్ చేసిన డాక్టర్లు..కడుపులో కత్తెర పెట్టి కుట్లు వేశారు. రోగుల ప్రాణాలంతే లెక్కేలేదు..మేమింతే అని మరోసారి నిరూపించారు. కడుపు నొప్పితో బాధ పడుతున్న ఓ మహిళ మూడు నెలల క్రితం నిమ్స్ ఆస్పత్రికి వెళ్లింది. ఆమెకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు కత్తెరను కడుపులోనే మర్చిపోయారు. ఆపరేషన్ చేసినా కడుపు నొప్పి తగ్గలేదని మరో డాక్టర్​ను సంప్రదించింది. కడుపులో కత్తెర ఉన్నట్టు ఎక్స్​రేలో తేలింది. కడుపునొప్పికి కారణమేంటో తెలిసి అంతా షాకయ్యారు. నిమ్స్ వైద్యుల నిర్లక్ష్యంపై ఆమె బంధువులు ఆందోళనకు దిగారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.