ఇవి కూడా చదవండి:దొంగ వస్తున్నాడు జాగ్రత్త... చంద్రబాబు కొత్త నినాదం
తెరాస, వైకాపా మధ్య ఉన్న ముసుగు తొలగింది!
సీఎం కుర్చీ కోసం రాష్ట్ర ప్రయోజనాల్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు.. వైకాపా అధ్యక్షుడు జగన్ తాకట్టు పెట్టారని తెదేపా నేత బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస, వైకాపా మధ్య ఉన్న ముసుగు తొలగిపోయిందన్నారు. జగన్.. రాష్ట్ర ద్రోహి అని వ్యాఖ్యానించారు.
తెదేపా నేత బుద్దా వెంకన్న
వైకాపా అధినేతజగన్... వ్యక్తిగత స్వార్ధంకోసం రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణ సీఎంకేసీఆర్, ప్రధాని మోదీ వద్ద తాకట్టు పెడుతున్నారని తెదేపా నేత బుద్దా వెంకన్న ఆరోపించారు.రాష్ట్రంలో జగన్ వంటి ప్రతిపక్ష నేత ఉండడం దురదృష్టకరమనిఅమరావతిలో వ్యాఖ్యానించారు. కేసుల మాఫీ కోసం జగన్... మోదీ కాళ్లు పట్టుకుంటే తమకేం అభ్యంతరం లేదన్న బుద్దా వెంకన్న...రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే హక్కు మాత్రం లేదని స్పష్టం చేశారు.కేసీఆర్ ఇచ్చిన వెయ్యి కోట్లు జగన్ ఎన్నికల్లో పంచుతున్నాడని ఆరోపించారు.కేసీఆర్తో కలిస్తే తప్పేంటి అని జగన్ చేసిన వ్యాఖ్యలతో.. వైకాపా, తెరాస మధ్య ఉన్న ముసుగు సంబంధం తేటతెల్లమైందని చెప్పారు. ఈ విషయంలో జగన్ను అభినందిస్తున్నానని అన్నారు.
ఇవి కూడా చదవండి:దొంగ వస్తున్నాడు జాగ్రత్త... చంద్రబాబు కొత్త నినాదం