ETV Bharat / briefs

పదహారేళ్ల బాలికపై ఆరుగురి సామూహిక హత్యాచారం - minor girl rape

దేశ రాజధాని నిర్భయ ఘటనలు ఈనాటికీ దేశంలో ఒక్కడో ఓ చోట వినిపిస్తూనే ఉన్నాయి. అమాయక అబలలు, పసికందులపై దాష్టికానికి ఒడిగడుతున్న మృగాళ్లు రోజురోజుకు పెరిగిపోతున్నారు. తాజాగా ఒంగోలులో వెలుగుచూసిన బాలిక అత్యాచార ఘటన కఠిన చట్టాల అవసరాన్ని మరోసారి గుర్తు చేస్తోంది.

ఐదుగురు మృగాళ్ల దాష్టికం..బాలికపై అఘాయిత్యం
author img

By

Published : Jun 22, 2019, 10:19 PM IST

Updated : Jun 23, 2019, 1:20 PM IST

తెలంగాణ రాష్ట్రం వరంగల్​​లో నెలలు పసికందుపై కామాంధుడి అఘాయిత్యం, కర్నూలులో మనవరాలి వయసున్న పిల్లలపై వృద్ధుడి అత్యాచార ఘటనలు మరవక ముందే మరో పైశాచిక పర్వం బయటపడింది.
కన్ను మిన్ను ఆనని మృగాళ్లు పది రోజులపాటు బాలికపై అత్యాచారం చేసిన ఘటన ఒంగోలులో చోటు చేసుకుంది. ఆశ్రయమిస్తామని మాయ మాటలు చెప్పి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.

గుంటూరు ప్రాంతానికి చెందిన విద్యార్థినికి ఒంగోలుకు చెందిన కారుడ్రైవర్​తో పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. అతడు పిలిచాడని పది రోజుల క్రితం ఆమె ఒంగోలుకు వచ్చింది. రాత్రి బస్టాండ్​లో దిగి తన స్నేహితుడి కోసం వేచిచూస్తోంది. అతడు ఎంతకూరానందున ఫోన్ చేయాలనుకుంది. తన వద్ద ఫోన్ లేనందున.. బస్టాండ్​లోని ఓ వ్యక్తి నుంచి ఫోన్ తీసుకుని ప్రయత్నించింది. ఆమె మిత్రుడు అందుబాటులోకి రాలేదు. బస్టాండ్​లో పనిచేసే ఓ దివ్యాంగుడైన యువకుడు ఆమెను గమనించాడు. ఆమె స్నేహితుడు తనకు తెలుసంటూ ఆ బాలికను బస్టాండ్ సమీపంలోని ఓ గదికి తీసుకెళ్లాడు. అనంతరం అక్కడికి తన స్నేహితుడిని పిలిపించి ఇద్దరూ కలిసి ఆమెపై అత్యాచారానికి తెగబడ్డారు.

వేరే గదికి తరలించి

అంతటితో ఆగని దుర్మార్గులు ఆ అమాయకురాలిని మరో గదికి తరలించారు. అక్కడ నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారు. వారు పదే పదే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె తిరస్కరిస్తే దివ్యాంగ యువకుడు చిత్రహింసలు పెట్టేవాడు. పదిరోజుల పాటు తిండి పెట్టకుండా, దుస్తులు ఇవ్వకుండా వారు బాలికను వేధించారు.

పోలీసు సాయం

బాధిత బాలిక ఎట్టకేలకు శనివారం సాయంత్రం ఆ మృగాళ్ల చెర నుంచి తప్పించుకుని ఆర్టీసీ బస్టాండ్​లో రోదిస్తూ కూర్చుంది. అక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ కానిస్టేబుల్ ఆమెను గమనించి ఆరా తీశారు. ఆ బాలిక కన్నీరుమున్నీరవుతూ దారుణాన్ని వివరించింది. ఆమెను ఓదార్చి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్​కు తరలించారు. అనంతరం బాధితురాలి కుటుంబీకులకు సమాచారామిచ్చి.. కేసు నమోదు చేసుకుని బాధితురాలిని వైద్య పరీక్షలకు తరలించారు. ఈ దారుణ కృత్యానికి కారకుడైన దివ్యాంగుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అతడిచ్చిన సమాచారం మేరకు నిందితుల్లో ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. సున్నితమైన అంశమైనందున నిందితులను గోప్యంగా విచారిస్తున్నారు.

ఇదీ చదవండి : చెల్లె పెళ్లి చేసుకుంటోందని.. సోదరుడి కిరాతకం!

Intro:యాంకర్ వాయిస్ : ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులను ప్రోత్సాహిస్తే ఉన్నత స్థితికి చేరతారని యానాది సమైఖ్య నాయకులు అన్నారు.. ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండలం కడవకుదురు లోని ప్రాధమిక పాఠశాల లోని విద్యార్థులకు 20 వేలరూపాయలు విలువచేసే 500 పుస్తకాలు విద్యార్థులకు పంపిణీ చేశారు.కార్యక్రమంలో యానాది సమఖ్యనాయకులు, అధికారులు పాల్గొన్నారు.Body:కె.నాగరాజు,చీరాల, ప్రకాశం జిల్లా, ఫోన్: 9766931899Conclusion:కె.నాగరాజు,చీరాల, ప్రకాశం జిల్లా, ఫోన్: 9866931899
Last Updated : Jun 23, 2019, 1:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.