ETV Bharat / briefs

రెండు నెలల విరామం తర్వాత వేటకు సిద్ధమైన గంగపుత్రులు - మత్య్సకారులు

రెండు నెలల చేపల వేట నిషేధం ముగిసిన అనంతరం..శుక్రవారం విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి మత్స్యకారులు వేటకు బయలు దేరారు.  గడిచిన రెండు సంవత్సరాలలో చేపల వేట ఆశాజనకంగా లేకపోయిన ఈసారైనా గంగమ్మ తల్లి తమను ఆదుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గంపెడు ఆశతో లక్షలు ఖర్చు చేసి మత్స్య కారులు వేటకు బయలుదేరారు.

విరామం అనంతరం చేపల వేటకు సిద్ధమైన గంగపుత్రులు
author img

By

Published : Jun 15, 2019, 6:29 AM IST

విశాఖ ఫిషింగ్ హార్బర్​లో ఉన్న 1500 బోట్లతో..ప్రత్యక్షంగా 15 వేల మంది పైగా జీవనోపాధి సాగిస్తున్నారు. చేపల వృద్ధి దృష్ట్యా ఏప్రిల్15 నుంచి జూన్ 15 వరకు చేపల వేటపై నిషేధిస్తారు. ఈ సమయంలో చేపల పిండోత్పత్తి జరుగుతుంది. ఇప్పుడు రెండు నెలల వేట విరామం తర్వాత బోట్లు సిద్ధం చేసుకున్న మత్స్యకారులు శుక్రవారం రాత్రి గంగమ్మ తల్లికి పూజలు చేసి చేపల వేటకు బయలుదేరారు. అయితే ఈసారి కేవలం 360 బోట్లు మాత్రమే చేపల వేటకు వెళ్లాయి. గత ప్రభుత్వం ఇస్తామన్న డీజిల్ సబ్సిడీ అందక కొందరు మత్స్యకారులు వేటకు వెళ్లలేదు. కొత్త ప్రభుత్వం సబ్సిడీ సొమ్ములు అందిస్తే..బోట్లు బాగు చేసుకుని రెండో విడతలో వేటకు వెళ్తామంటున్నారు.

ఒక బోటు వేటకు వెళ్లాలంటే 4 నుంచి ఐదు లక్షలు ఖర్చు అవుతుంది. బోటు వేటకు వెళ్లే ముందు డీజిల్, ఐస్, పది రోజులకు సరిపడ్డా ఆహారం తీసుకెళ్తారు. ప్రతి బోటుకు 5 నుంచి 10 మంది కలాసీలు ఉంటారు. చేపల వేటకు వెళ్లే ప్రతి బోటు అన్ని అనుమతులు కల్గి ఉండాలి. అనుమతులు లేని పక్షంలో కోస్టుగార్డ్, పోర్టు సెక్యూరిటీ విభాగాల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి.

చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులు...బోట్లు మరముత్తు చేసుకోవడం, వలలు అల్లుకోవడం చేస్తారు. వేటలో రొయ్యలు ఎక్కువగా లభిస్తేనే వేటకు వెళ్లిన ఫలితం దక్కుతుంది. ఒక ఏడాదిలో విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి రూ. 1200 కోట్ల మత్స్య లావాదేవీలు జరుగుతాయి. గత రెండేళ్లుగా సరైన రాబడి లేదని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. కనీసం ఈ ఏడాదైనా అన్ని అనుకూలిస్తాయన్న ఆశతో వేటకు బయలుదేరారు.

ఇదీ చదవండి : పిల్లలూ.. మామయ్యను వచ్చా: జగన్​

Intro:విజయనగరం జిల్లా బొబ్బిలి పారిశ్రామికవాడలోని బాలాజీ పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య మూడుకు చేరింది. ఈ ఘటనపై జిల్లా అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు

Body:జిల్లా కలెక్టర్ హరిజవహర్లాల్ ర్ సబ్ కలెక్టర్ చేతన్ ఏఎస్పీ గౌతమి సాలి సందర్శించి పరిస్థితిని తెలుసుకున్నారు చట్టపరంగా యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

Conclusion:బొబ్బిలి పారిశ్రామికవాడలోని యాజమాన్యాలు కార్మిక చట్టాలు అమలు చేయడం లేదని తన దృష్టికి వచ్చిందని దీనిపై అన్ని విధాల దర్యాప్తు నిర్వహించి వారికి న్యాయం చేస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.