కర్నూలు జిల్లా డోన్‌కు చెందిన ఓ మహిళ చిట్టీల పేరుతో రూ.10 కోట్లు వసూలు చేసి పరారైంది. పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన నిర్మల అనే మహిళ చిట్టీల పేరుతో పలువురిని మోసగించింది. ఆ మహిళ గత 20 రోజులుగా కన్పించకపోయే సరికి...బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితులు డీఎస్పీ ఖాదర్ బాషాను కలిసి తమ గొడును విన్నవించుకున్నారు.
టీచర్స్ కాలనీలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో మహిళ కమిటీ సభ్యురాలిగా ఉన్న నిర్మల..పలువురితో పరిచయం పెంచుకుంది. తనకున్న పరిచయాలతో చిట్టీలు వేయమని చెప్పి నగదు వసూలుచేసింది. తాను చేసిన అప్పులను చిట్టీల డబ్బుతో తీర్చేదని బాధితులు అన్నారు. మొదట్లో కొందరికి వడ్డీలు, చిట్టీల నగదు బాగానే ఇచ్చి నమ్మించింది. చివరకు అప్పులు తీర్చలేక పరారైంది. హైదరాబాద్‌కు పరారయ్యినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. నిందితురాలికి సంబంధించిన ఆస్తులు స్వాధీనం చేసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు డీఎస్పీని కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలి కోసం గాలిస్తున్నారు.
ఇవీ చూడండి : మెడిసిన్‌లో గుంటూరు విద్యార్థికి 9వ ర్యాంక్