ETV Bharat / briefs

ఫెడరల్‌ ఫ్రంట్‌ మేనిఫెస్టోలో 'హోదా' పెట్టిస్తారా: బాబు

రాజకీయాల్లో అవకాశవాద నేతలకు బుద్ధి చెప్పాలని సీఎం చంద్రబాబునాయుడు నెల్లూరు జిల్లా దుత్తలూరులో పిలుపునిచ్చారు. దుర్మార్గులను ఓడిస్తేనే భావి తరాలకు భవిష్యత్తు అని స్పష్టం చేశారు.

దుత్తలూరు ప్రచారంలో సీఎం చంద్రబాబు
author img

By

Published : Apr 3, 2019, 5:36 PM IST

దుత్తలూరు ప్రచారంలో సీఎం చంద్రబాబు
మహిళలు సైతం డబ్బు సంపాదించాలనే డ్వాక్రా సంఘాలు పెట్టానని తెలిపిన సీఎం... ఆడబిడ్డలు తమ కాళ్లపై తాము నిలబడేలా అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. పండుగల సమయంలో రెండు సిలిండర్లు ఉచితంగా ఇస్తానన్న చంద్రబాబు... పట్టణ ప్రాంతాల్లో ఉచితంగా ఇళ్లు కట్టిస్తామన్నారు. గర్భిణులకు వైద్య ఖర్చులు, మందులు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చిన సీఎం... పిల్లలకు గార్డియన్‌గా ఉండి... బాగా చదివిస్తానన్నారు.

జగన్‌ను చూస్తే పారిశ్రామికవేత్తలు పారిపోతారన్న బాబు...హోదా ఇస్తామని ఫెడరల్‌ ఫ్రంట్‌ మేనిఫెస్టోలో పెట్టించగలరా అని జగన్‌ను ప్రశ్నించారు. మోదీ చెబుతున్న ఏటీఎంలు ఎప్పుడో ఎత్తిపోయాయని ఎద్దేవా చేసిన సీఎం...మోదీ, కేసీఆర్‌, జగన్‌ ఎప్పుడూ నిజం చెప్పరని విమర్శించారు. ఉదయగిరి దుర్గాన్ని నెంబర్‌వన్‌ పర్యాటక కేంద్రం చేస్తానని హామీ ఇచ్చిన బాబు... 600 కోట్లతో సోమశిల హైలెవల్‌ కాల్వ పనుల్ని చేస్తున్నామన్నారు.చింతలదీవిలో రూ.250 కోట్లతో కామధేను ప్రాజెక్టు పూర్తి చేస్తామని భరోసా ఇచ్చిన సీఎం... వెలుగొండ టన్నెల్ పూర్తి చేసి ఉదయగిరికి నీళ్లు ఇస్తామని ప్రకటించారు.

ఇవీ చూడండి :సుజనాకు ఈడీ షాక్... రూ. 315 కోట్ల ఆస్తుల జప్తు

Intro:పేదల సంక్షేమానికి పెద్ద పేట వేసి అభివృద్ధికి మారుపేరని నిరూపించిన తెలుగుదేశం పార్టీని మళ్లీ గెలిపించాలని సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలో తేలుకుంచి బొడ్డకళి హరిపురం గ్రామాల్లో విస్తృత స్థాయిలో మహిళలు యువత కలిసి ఇంటింటా ప్రచారాలు కొనసాగించారు

Body:ఈటీవీ

Conclusion:ఈటీవీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.