ETV Bharat / briefs

నవ్యాంధ్ర ఎన్నికల పోలింగ్ పరిసమాప్తి - ap elections

రాష్ట్రవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

vote
author img

By

Published : Apr 11, 2019, 6:00 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. 46 వేల 120 ఓటింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించారు. ఎన్నికల సంఘం ముందే చెప్పిన ప్రకారం.. సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్​లో ఉన్న అందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 7 గంటలకే పోలింగ్ మొదలైనా... రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎంల మొరాయింపు ఓటర్ల సహనానికి పరీక్ష పెట్టింది. సాంకేతిక సిబ్బంది సమస్య పరిష్కరించేసరికి దాదాపు 2 గంటల పోలింగ్ సమయం వృథా అయ్యింది. పోలింగ్ సమయాన్ని పెంచాలని కొందరు ఈసీని కోరినా... ఉన్నతాధికారులు అంగీకరించలేదు. చివరికి.. సాయంత్రం 6 గంటలకు ఎంతమంది క్యూలైన్​లో ఉన్నా.. ఓటు వేసే అవకాశం మాత్రం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు.. మధ్యాహ్నం 3 గంటల సమయానికి 54 శాతం దాటిన పోలింగ్.. ప్రక్రియ పూర్తయ్యే సరికి 65 శాతం నుంచి 70 శాతం మధ్య నమోదయ్యే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.