ETV Bharat / briefs

ప్రజావేదిక అక్రమకట్టడం.. దాన్ని కూల్చేస్తాం: సీఎం జగన్

ఉండవల్లి ప్రజావేదికను కూలగొట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఈ కట్టడాన్ని ఎల్లుండి నుంచే తొలగిస్తామని ముఖ్యమంత్రి జగన్​మోహనరెడ్డి స్పష్టం చేశారు. ప్రజావేదికలో కలెక్టర్ల సమావేశాన్ని నిర్వహించిన ముఖ్యమంత్రి.. దానిని కూలగొట్టబోతున్నట్లు అదే వేదికపై నుంచి ప్రకటించారు.

ప్రజావేదికను కూల్చేస్తాం.
author img

By

Published : Jun 24, 2019, 12:00 PM IST

Updated : Jun 24, 2019, 12:27 PM IST

ప్రజావేదిక అక్రమకట్టడం.. దాన్ని కూల్చేస్తాం: సీఎం జగన్
కిందటి తెదేపా ప్రభుత్వంలో అనేక అధికారిక కార్యక్రమాలకు వేదికగా నిలిచిన ఉండవల్లి ప్రజావేదిక ఇక కనిపించదు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఆ కట్టడాన్ని కూల్చివేయాలని.. ముఖ్యమంత్రి జగన్​మోహనరెడ్డి ఆదేశాలిచ్చారు. పర్యావరణ ,నదీ సంరక్షణ చట్టాలను ఉల్లంఘించి ప్రజావేదికను నిర్మించారని.. చట్టవ్యతిరేకంగా అవినీతి సొమ్ముతో నిర్మించిన ఈ భవనాన్ని తొలగిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

చంద్రబాబు లేఖ

ఉండవల్లి ప్రజావేదికపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదానిపై కొన్ని రోజులుగా ఉత్కంఠ సాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి అనుబంధంగా.. ఈ ప్రజావేదిక నిర్మాణం జరిగింది. ప్రజల ఫిర్యాదుల స్వీకరణతోపాటు. అధికారిక కార్యక్రమాలకు చంద్రబాబు ప్రజావేదికనే వినియోగించారు. తెదేపా ఓటమి తర్వాత.. ఈ భవనాన్ని తన వ్యక్తిగత కార్యాలయంగా వినియోగించుకునేందుకు కేటాయించాలని చంద్రబాబు లేఖ రాశారు. దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోని ప్రభుత్వం.. సోమవారం నుంచి 2 రోజుల పాటు కలెక్టర్ల సమావేశం.. ప్రజావేదికలోనే నిర్వహించాలని నిర్ణయించింది.

వేదికపై నుంచే అనూహ్య నిర్ణయం

కలెక్టర్ల సమావేశం ప్రజావేదికలోనే ప్రారంభమైంది. కొత్త ప్రభుత్వం కూడా అధికారిక కార్యక్రమాలకు ఈ భవనాన్నే వినియోగించనుందనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించారు. తాము సమావేశమైంది ఒక అక్రమకట్టడంలో అని వ్యాఖ్యానించారు. కిందటి ప్రభుత్వం నిబంధనలు పాటించకుండా.. నదీ పరిరక్షణ చట్టాలకు.. వ్యతిరేకంగా ఈ భవనాన్ని నిర్మించిదన్నారు. అక్రమ కట్టడాల తొలగింపు.. ఈ భవనంతోనే ప్రారంభిస్తామని చెప్పిన ఆయన ... రెండు రోజుల తర్వాత ప్రజావేదిక కూల్చివేయాలని ఆదేశాలిచ్చారు.
ఉండవల్లి ప్రజావేదిక అక్రమ కట్టడం అన్న విషయాన్ని అందరికీ తెలియజేసేందుకే.. కలెక్టర్లు.. ఐపీఎస్​ల సమావేశాన్ని ఈ వేదికలో నిర్వహించామన్నారు. ఈ కూల్చివేత ద్వారా.. అక్రమ నిర్మాణాలను ఏమాత్రం సహించబోమనే సందేశాన్ని రాష్ట్ర ప్రజలకు ఇస్తామని చెప్పారు.

Last Updated : Jun 24, 2019, 12:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.