పగలంతా రోహిణీ కార్తె ఎండలతో ఉక్కపోతతో అల్లాడిన విశాఖ వాసులను వరుణుడు కరుణించాడు. నగరంలో సాయంత్రం ఒక్కసారిగా కమ్ముక్కున్న మేఘాలతో జనం ఊపిరి పీల్చుకున్నారు. చిన్నగా మొదలైన వర్షం...ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో తీవ్రమైంది. నగరంలో పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గంట వ్యవధిలో కురిసిన భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి.
ఇవీ చూడండి : రుతు పవనాలు ఆలస్యం... మరికొన్ని రోజులు ఉష్ణాగ్రహం