ETV Bharat / briefs

గత ప్రభుత్వం నిర్వాకంతోనే విత్తన కొరత: కన్నబాబు - విత్తనాల సేకరణ

గత ప్రభుత్వం నిర్వాకంతోనే రాయలసీమలో విత్తన కొరత ఏర్పడిందని వ్యవసాయ మంత్రి కన్నబాబు అన్నారు. విత్తన కంపెనీలకు చెల్లించాల్సిన నిధులు పక్కదారి పట్టడం వలనే ఈ సమస్య వచ్చిందన్నారు. వారం రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు.

గత ప్రభుత్వం నిర్వహణ లోపంతోనే విత్తన కొరత : మంత్రి కన్నబాబు
author img

By

Published : Jun 26, 2019, 5:13 PM IST

Updated : Jun 26, 2019, 5:21 PM IST

గత ప్రభుత్వం నిర్వహణ లోపంతోనే విత్తన కొరత : మంత్రి కన్నబాబు

ముందుచూపులేని గత ప్రభుత్వం నిర్వాకంతోనే రాయలసీమ జిల్లాల్లో వేరుశనగ విత్తనాల కొరత ఏర్పడిందని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు ఆరోపించారు. నవంబర్ నుంచి విత్తనాల సేకరణ ప్రక్రియ ప్రారంభిస్తేగాని సకాలంలో రైతులకు అందించలేమన్నారు. విత్తన కంపెనీలకు చెల్లించాల్సిన నిధులు దారి మళ్లించడం వలనే ఆయిల్ ఫెడ్, ఏపీ సీడ్స్ విత్తనాలు సేకరించలేదన్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు నాణ్యమైన విత్తనాలు సేకరించి రైతులకు అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు మంత్రి చెప్పారు. ఇప్పటికే 2లక్షల 83వేల క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. మిగిలిన రైతులకు సైతం త్వరలోనే విత్తనాలు అందిస్తామన్నారు. రబీలో రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి ఇంకా వెయ్యి కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. మరో వారం రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి : 'నదీ పరివాహక ప్రాంతంలోని కట్టడాలన్నీ కూలుస్తారా?'

Intro:ప్రజల సొమ్ము తో నిర్మించిన ప్రజావేదికను రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేయడాన్ని భాజపా జాతీయ కార్యదర్శి సత్య కుమార్ తప్పుపట్టారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియం బుధవారం నిర్వహించిన 'అత్యయిక పరిస్థితి- భారత ప్రజాస్వామ్య చరిత్ర లో అత్యంత చీకటి ఘట్టం' అనే సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కక్ష సాధింపు చర్యతోనే ప్రజా వేదికను కూల్చివేస్తుంది ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేయాలని అనుకుంటే కమిటీల ద్వారా సమీక్షి చేయాలే తప్ప ఇలా కక్షసాధింపు దోరణితో చేయడం సమంజసం కాదని హితవు పలికారు.

Body:t

Conclusion:
Last Updated : Jun 26, 2019, 5:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.