గుంటూరులో హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యులను.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పరామర్శించారు. గుంటూరు పరమయ్యగుంటలో రమ్య కుటుంబీకులను ఓదార్చిన లోకేశ్... వాళ్లకు ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇంట్లోని మహిళలకే ముఖ్యమంత్రి రక్షణ కల్పించలేని పరిస్థితుల్లో ఉన్నారని విమర్శించారు.
ఈ సందర్భంగా స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. రాజకీయ లబ్ధికోసమే లోకేశ్ వచ్చారంటూ వైకాపా శ్రేణులు అక్కడికి చేరుకొని ఆరోపించాయి. ఈ క్రమంలో తెదేపా-వైకాపా కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోటాపోటీ నినాదాలతో శ్రేణులు ఆరోపణలు చేసుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరిస్థితిని సద్దుమణిగించే ప్రయత్నాలు చేపట్టారు. ఈ క్రమంలో లోకేశ్‌తో పాటు మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేశారు. లోకేశ్‌ను ప్రత్తిపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మిగతా నేతలను వివిధ ప్రాంతాల్లోని స్టేషన్లకు తీసుకెళ్లారు.
ఇదీ చదవండి..