ETV Bharat / city

CRUEL FATHER: సమాజం సిగ్గుపడేలా కూతురిపై కన్నేసిన తండ్రి - కృష్ణా జిల్లాలో ఐదేళ్ల కుమార్తెపై తండ్రి అత్యాచారం వార్తలు

Father rapes daughter in Krishna district
అమానవీయం.. ఐదేళ్ల కుమార్తెపై తండ్రి అత్యాచారం
author img

By

Published : Sep 8, 2021, 2:21 PM IST

Updated : Sep 9, 2021, 9:51 AM IST

14:19 September 08

ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన తండ్రి

ముక్కుపచ్చలారని చిన్నారి.. నిండా అయిదేళ్లు కూడా లేని కన్నబిడ్డపై కన్నేశాడో కసాయి తండ్రి. కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ కామాంధుడు చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. కూతురు ఆరోగ్యం బాగోకపోవడంతో గుర్తించిన తల్లి చిట్టి తల్లీ ఏమైందంటూ ఆరా తీశారు. వచ్చీ రాని మాటలతో తండ్రి చేసిన అఘాయిత్యాన్ని చెప్పడంతో ఆ తల్లి ఒక్కసారిగా నిశ్చేష్టురాలైంది. దాదాపు రెండున్నర నెలల కిందట జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సభ్య సమాజం సిగ్గుపడేలా చేసినా ఈ అమానవీయ సంఘటన నున్న పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.

నున్న పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నివాసం ఉండే దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. భర్త నగరంలోని ఒక జాతీయ విద్యాసంస్థలో పీడీగా పనిచేస్తున్నాడు. కొద్ది రోజులుగా పెద్ద కుమార్తె (5)కు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తల్లి ఆమెను వైద్యుడి వద్దకు ఈ ఏడాది జూన్‌ 21న తీసుకెళ్లారు. వైద్యుడు పరీక్షించి మూత్ర సంబంధమైన ఇన్‌ఫెక్షన్‌ సోకి ఉండవచ్చని భావించి మందు ఇచ్చి పంపించారు. మందు వాడినా కూతురు ఆరోగ్యం కుదుటపడలేదు. ఏమైందంటూ కూతురును ప్రశ్నించిందా తల్లి. వచ్చీ రాని మాటలతో కన్న తండ్రి చేసిన పనులు చెప్పడంతో ఆ కామాంధుడి చేష్టలు వెలుగులోకి వచ్చాయి. బిడ్డపై తీవ్రస్థాయిలో లైంగిక వేధింపులతో పాటు అత్యాచారానికి పాల్పడిన భర్తను ఆమె నిలదీశారు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అతడు ఇంట్లో నుంచి పారిపోయాడు. ఈ నెల 4న మళ్లీ ఇంటికి వచ్చి కూతురును తీసుకెళ్లిపోతుండగా చిన్నారి అమ్మమ్మ అడ్డుకున్నారు. కంట్రోల్‌రూంకు ఫోన్‌ చేయడంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు. దీనిపై చిన్నారి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయవాడ దిశ పోలీసు స్టేషన్‌లో నిందితుడిపై ఐపీసీ 376ఏబీ సెక్షన్‌, పోక్సో చట్టం కింద ఈ నెల 6న కేసు నమోదు చేశారు. చిన్నారిని విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో చేర్చి వైద్యపరీక్షలు చేశారు. నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అతడిని న్యాయస్థానంలో హాజరు పరచగా రిమాండ్‌ విధించారు.

ఇదీ చదవండి:

 TEACHERS AGITATION: ఉపాధ్యాయుడిపై దాడి..టీచర్ల సంఘాల ఆందోళన

Last Updated : Sep 9, 2021, 9:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.