ETV Bharat / city

CHANDRABABU: అన్యాయం చేసినవారిని వదలం.. ఎక్కడున్నా శిక్షిస్తాం: చంద్రబాబు

ప్రజా దేవాలయమైన ఎన్టీఆర్‌ భవన్‌పై దాడి
ప్రజా దేవాలయమైన ఎన్టీఆర్‌ భవన్‌పై దాడి
author img

By

Published : Oct 22, 2021, 7:14 PM IST

Updated : Oct 23, 2021, 3:53 AM IST

20:49 October 22

డ్రగ్స్​కు అడ్డాగా రాష్ట్రం

ముఖ్యమంత్రి జగన్‌ ఉన్మాదంతో రాష్ట్రాన్ని నాశనం చేయాలనుకుంటున్నారని చంద్రబాబు ఆక్షేపించారు. 'కోర్టు చీవాట్లు పెట్టినా.. మొట్టికాయలేసినా పట్టించుకోని దుర్మార్గుడు జగన్‌' అని ధ్వజమెత్తారు. తెదేపా కార్యాలయాలు, ఇళ్లపై దాడికి నిరసనగా 'ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు' పేరిట చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్ష ముగిసింది. నిమ్మరసం ఇచ్చి తెదేపా మహిళా నేతలు దీక్ష విరమింపజేశారు. ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరుకు కదిలి వచ్చిన కార్యకర్తలకు తెదేపా అధినేత ధన్యవాదాలు తెలిపారు. దీక్ష ముగింపు సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు వైకాపా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తాము చేసేది ధర్మపోరాటమని.. ముమ్మాటికీ విజయం తమదేనని స్పష్టం చేశారు.  

ఈ మద్యం బ్రాండ్లు ఏ రాష్ట్రంలోనైనా ఉన్నాయా ?

తెదేపా హయాంలో మద్యం నియంత్రణ పారదర్శకంగా జరిగిందని చంద్రబాబు గుర్తు చేశారు. మద్యం విధానాన్ని క్రమబద్ధీకరించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కిందన్నారు. మద్యం బ్రాండ్లు మార్చేందుకు ఏ సీఎం అయినా సాహసించారా ? అని ప్రశ్నించారు. ఏపీలోని మద్యం బ్రాండ్లు ఏ రాష్ట్రంలోనైనా ఉన్నాయా? అని నిలదీశారు. దశల వారీగా మద్యపానం నిషేధిస్తానని చెప్పిన జగన్..ఆడబిడ్డల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను మద్యానికి బానిసలుగా మారుస్తున్నారన్నారు. ప్రజలు మత్తుకు బానిసై కొవిడ్‌ వేళ శానిటైజర్లు కూడా తాగారని గుర్తు చేశారు.  

కేసీఆర్​కు ఉన్న తీరిక జగన్​కు లేదా?

విదేశాల నుంచి డ్రగ్స్ వస్తున్నాయని తెలిసినా ప్రభుత్వం పట్టించుకోలేదని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీలో రూ.లక్ష కోట్ల విలువైన డ్రగ్స్ ఉన్నట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయని గుర్తు చేశారు. డ్రగ్స్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించి..డ్రగ్స్‌రహిత రాష్ట్రంగా తెలంగాణను మారుస్తామన్నారు. సీఎం జగన్‌కు మాత్రం డ్రగ్స్‌పై సమీక్ష నిర్వహించే తీరిక లేదా ? అని ప్రశ్నించారు. గంజాయిపై మాట్లాడితే పోలీసులు ఆధారాలు అడుగుతున్నారని ఆక్షేపించారు. ఆధారాలు ఇస్తాం..పోలీసులు యూనిఫాం తీసేసి..గంజాయి విచారణ మాకే ఇవ్వండని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్‌కు బానిసైతే యువత చేతికి వస్తారా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు.  

20:47 October 22

రాజకీయాల కోసం తల్లిని,చెల్లిని వాడుకున్నారు

అప్పుడు జగన్ చిన్నపిల్లాడు

40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ బూతులు మాట్లాడలేదని చంద్రబాబు అన్నారు. పట్టాభి మాటలకు వైకాపా నాయకులు కొత్త అర్థాలు చెబుతున్నారని ఆక్షేపించారు. రాజకీయం కోసం జగన్‌..తన తల్లిని, చెల్లిని ఉపయోగించుకుంటున్నారన్నారు. జైలుకెళ్లినప్పుడు జగన్‌ తన తల్లిని ఊరూరా తిప్పారని..,చెల్లిని జగనన్న బాణం అని యాత్రలు చేయించారన్నారు. జగనన్న వదిలిన బాణం ఇప్పుడు తెలంగాణలో తిరుగుతుందని ఎద్దేవా చేశారు. తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని సీఎం రాష్ట్రానికేం చేస్తారని నిలదీశారు. తాను తొలిసారి సీఎం అయినప్పుడు జగన్ చిన్న పిల్లాడన్న చంద్రబాబు..వివేకాను తానే చంపించానని గతంలో ఆరోపించారన్నారు. తాము చేసేది ధర్మ పోరాటమని ముమ్మాటికీ విజయం తమదేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు.  

అధికారంలోకి వచ్చాక కమిషన్‌ వేస్తాం

ప్రాజెక్టులపై ఏపీ హక్కులను కేంద్రానికి అప్పగించారుని వైకాపా ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాలువ తవ్వాలన్నా కేంద్రం అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారన్నారు. రెండున్నరేళ్లుగా పన్నులు వేస్తూ ప్రజలపై భారం మోపుతున్నారని ఆక్షేపించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉగ్రవాదానికి లొంగిపోవాలా ? అని ప్రశ్నించారు. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే కమిషన్‌ వేస్తానని..,రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసినవారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని చంద్రబాబు అన్నారు. అన్నీ దోచుకునే కార్యక్రమాలకు వైకాపా ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని.., రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాటం చేసేందుకు పార్టీలు ముందుకు రావాలన్నారు. పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు ఏకమై ప్రభుత్వ దుర్మర్గాలపై పోరాడాలన్నారు.  

19:10 October 22

చంద్రబాబు 36 గంటల నిరశన విరమణ

అధికారంలోకి వచ్చాక కమిషన్ వేస్తాం

దాడి ఘటనపై  సీబీఐ విచారణ జరిపించాలి

తెదేపా కేంద్ర కార్యాలయంతో 70 లక్షల మంది కార్యకర్తల మనోభావాలు ఉన్నాయని.. ప్రజా దేవాలయమైన ఎన్టీఆర్‌ భవన్‌పై దాడి చేశారని చంద్రబాబు ఆక్షేపించారు. సీఎం నివాసం, డీజీపీ కార్యాలయం సమీపంలోనే తమ పార్టీ కార్యాలయం ఉన్నా...దాడి జరగటం కుట్రపూరితమన్నారు. పార్టీ కార్యాలయంపై దాడి..దేశ చరిత్రలో తొలిసారి అని ఈ ఘటనపై  సీబీఐ విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలన్నారు. వ్యవస్థ మొత్తం కలిసి ప్రభుత్వ ఉగ్రవాదానికి శ్రీకారం చుట్టిందని..,బావితరాల భవిష్యత్తు కోసం పోరాటానికి కలిసిరావాలని పార్టీలు, ప్రజాసంఘాలను చంద్రబాబు  కోరారు.  

ఇదీ చదవండి

TDP Fire On YCP:సవాంగ్ డీజీపీ కాదు.. 'డీజేపీ'.. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది: తెదేపా

Last Updated : Oct 23, 2021, 3:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.