ETV Bharat / bharat

కోర్టులో కాల్పుల కలకలం.. మహిళకు బుల్లెట్​ గాయాలు.. ఆస్పత్రికి తరలింపు - దిల్లీ కోర్టులో కాల్పులు

దిల్లీలో కాల్పులు కలకలం రేపాయి. సాకేత్​ కోర్టులో ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఓ మహిళకు బుల్లెట్ గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

saket court firing
saket court firing
author img

By

Published : Apr 21, 2023, 12:01 PM IST

Updated : Apr 21, 2023, 1:05 PM IST

దేశ రాజధాని దిల్లీలోని సాకేత్​ కోర్టులో శుక్రవారం ఉదయం కాల్పులు జరిగాయి. ఓ వ్యక్తి సాకేత్‌ కోర్టులో నాలుగు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ మహిళకు బుల్లెట్ గాయాలు కాగా.. ఆమెను ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు సాకేత్ కోర్టుకు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాల్పుల సమయంలో మహిళ తన న్యాయవాదితో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని.. సస్పెండ్ అయిన లాయర్​గా గుర్తించారు. డబ్బు విషయంలో గొడవ వల్లే నిందితుడు.. బాధితురాలిపై కాల్పులు జరిపినట్లు వెల్లడించారు.

కోర్టులో కాల్పుల జరగడం వల్ల ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ సమయంలో న్యాయవాదులు కోర్టు ప్రాంగణంలో ఉన్నారు. కోర్టు ప్రవేశ ద్వారం వద్ద ప్రతి ఒక్కరినీ తనిఖీలు చేసి లోపలికి పంపిస్తారు. అయితే నిందితుడు తుపాకీతో ఎలా కోర్టు లోపలికి చేరుకున్నాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు మాజీ లాయర్‌ అని కోర్టు సెక్యూరిటీ తనిఖీలు నిర్వహించలేదా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. కోర్టు ఆవరణలో కాల్పులు జరగడం వల్ల పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు.

మరోవైపు.. బాధితురాలు సాకేత్​ కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తోందని తెలిపారు సాకేత్ బార్​ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కర్నైల్ సింగ్. నిందితుడు కొన్నాళ్ల క్రితం సస్పెండ్ అయ్యాడని ఆయన తెలిపారు. మూడు నెలల క్రితం దిల్లీ బార్ కౌన్సిల్.. నిందితుడి లైసెన్స్​ను రద్దు చేసిందని సింగ్ పేర్కొన్నారు. బాధితురాలి పేరు రాధ అని వెల్లడించారు. నిందితుడి పేరు కామేశ్వర్ ప్రసాద్ సింగ్ ఆయన చెప్పారు. నిందితుడికి, బాధితురాలికి ఆర్థిక తగాదాలు ఉన్నాయని.. అందువల్లే ఈ కాల్పులు జరిగి ఉండవచ్చని అన్నారు.

గ్యాంగ్​స్టర్​పై కాల్పులు..
గతేడాది సెప్టెంబరు 24న దిల్లీలోని రోహిణి కోర్టులో గ్యాంగ్​స్టర్ జితేందర్ మాన్​ అలియాస్​ గోగిపై కాల్పులు జరిపారు ఇద్దరు దుండగులు. వెంటనే ప్రతిఘటించిన పోలీసులు వారిద్దరిపై కాల్పులు జరిపి హతమార్చారు. సాయుధులు.. లాయర్ల వేషంలో కోర్టులోకి ప్రవేశించారని పోలీసులు తెలిపారు. రోహిణి కోర్టులో కాల్పులు జరిపిన వారిని రాహుల్​ త్యాగి, జగదీప్ జగ్గాగా పోలీసులు గుర్తించారు.

కోర్టు ఆవరణలో కాల్పులు..
2021లో రాజస్థాన్‌లోని ధోల్‌పుర్ సెషన్స్ కోర్టు ఆవరణలో హత్య కేసు నిందితుడిపై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. నాటు తుపాకీ కావడం వల్ల తూటా బయటకి రాకపోవటం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Last Updated : Apr 21, 2023, 1:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.