ETV Bharat / bharat

మొన్న రైలింజన్​.. నిన్న ఇనుప బ్రిడ్జ్​.. ఇప్పుడు విద్యుత్​ టవర్లనే కాజేసిన దొంగలు! - దొంగతనం

హైఓల్టేజ్​ విద్యుత్తు ట్రాన్స్​మిషన్​ స్తంభాలపై కన్నేశారు దొంగలు. పంజాబ్​లోని బఠిండాలో ఈ సంఘటన వెలుగు చూసింది. మొదటి స్టెప్​లో నట్లు వెల్డింగ్​ చేయటం వల్ల రెండో స్టెప్​లో బోల్టులు, నట్లను తొలగించటం వల్ల రెండు టవర్లు కూలిపోయాయి. దీంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఎఫ్​ఐఆర్​ నమోదు చేసిన పోలీసులు.. పునరుద్ధరణ పనులు చేపట్టారు.

thieves stole 66 KV Towers
66కేవీ విద్యుత్తు స్తంభాలు చోరీ
author img

By

Published : May 21, 2022, 5:09 PM IST

డబ్బులు, బంగారం చోరీలకు పాల్పడటం రొటీన్​గా ఉంటుందనుకున్నారేమో.. రూట్​ మార్చి దొంగతనాలకు పాల్పడుతున్నారు కొందరు దుండగులు. బిహార్​లోని రెండు జిల్లాల్లో ఇనుప వంతెనలను ఎత్తుకెళ్లిన ఘటనలు మరవకముందే అలాంటి చోరీనే పంజాబ్​లోని బఠిండా జిల్లాలో వెలుగు చూసింది. అయితే, ఈసారి ఏకంగా హైఓల్టేజ్​ విద్యుత్తు స్తంభాలనే మాయం చేసే ప్రయత్నం చేశారు. దీంతో అవి కుప్పకూలి విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

thieves stole 66 KV Towers
66కేవీ విద్యుత్తు స్తంభాలను పరిశీలిస్తున్న అధికారులు.

ఇదీ జరిగింది: జిల్లాలోని రాంపుర పూల్​లో రెండు 66 కేవీ హైఓల్టేజ్​ విద్యుత్తు స్తంభాలు కూలిపోయాయి. దొంగతనం కోసం టవర్ల బోల్టులు తొలగించటం వల్ల పడిపోయినట్లు అధికారులు తెలిపారు. స్తంభాలు కూలిపోవటం వల్ల అక్కడి నుంచి దొంగలు పారిపోయారని చెప్పారు. విషయం తెలుసుకున్న డిస్ట్రిబ్యూషన్​ ఇంజినీరింగ్​ డైరెక్టర్​ డీపీఎస్​ గ్రెవాల్​ సంఘటనాస్థలాన్ని సందర్శించారు. దీనిపై శాఖాపరమైన దర్యాప్తు చేపట్టేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీ వేయటం సహా.. పోలీసులకు ఫిర్యాదు చేయాలని పీఅండ్​ఎం విభాగం చీఫ్​, ఎస్​ఈని ఆదేశించారు. టవర్లు కూలిపోవటం వల్ల నిలిచిన విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించేందుకు రిపేర్​ పనులు చేస్తున్నట్లు చెప్పారు.

"రాంపుర పూల్​లోని రెండు 66కేవీ లైన్​ టవర్ల నట్లు తీసేందుకు ప్రయత్నాలు జరిగాయి. మొదటి స్టెప్​లో నట్లకు వెల్డింగ్​ చేయటం వల్ల.. రెండో స్టెప్​లో తీశారు. దీంతో మూడో స్టెప్​లోని బేస్​ కుదుపులకు లోనైంది. ఈ పరిస్థితులను గమనిస్తే.. ఇది ఒక్కరోజులో జరిగినట్లు లేదు. కొన్ని రోజుల పాటు నట్లు తొలగించి చోరీకి పాల్పడేందుకు యత్నించారు."

- డీపీఎస్​ గ్రెవాల్​, డిస్ట్రిబ్యూషన్​ ఇంజినీరింగ్​ డైరెక్టర్​.

దర్యాప్తు కమిటీలో పీఅండ్​ఎం బఠిండా ఎస్​ఈ, బఠిండా డిస్ట్రిబ్యూషన్​ ఎస్​ఈ, పాటియాల ట్రాన్స్​మిషన్​ ఎస్​ఈలు ఉన్నట్లు చెప్పారు గ్రెవాల్​. త్వరలోనే విద్యుత్తు సరఫరాను పునరుద్ధరిస్తామని, రిపేర్​కు సంబంధించిన సామగ్రిని సంఘటనా స్థలానికి చేర్చామన్నారు. ఆదివారం సాయంత్రానికి విద్యుత్తు సరఫరా చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: : 60 అడుగుల బ్రిడ్జిని మాయం చేసిన దొంగలు.. అధికారులు షాక్

80 అడుగుల మరో వంతెన మాయం.. ఈసారి పక్క జిల్లాలో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.