ETV Bharat / bharat

దళిత విద్యార్థిని బాత్​రూమ్​లో పెట్టి తాళం వేసిన టీచర్​, 18 గంటలు అలానే - uttarpradesh news

11 ఏళ్ల విద్యార్థిని బాత్​రూమ్​లో పెట్టి తాళం వేసి ఇంటికి వెళ్లిపోయాడు ఓ ఉపాధ్యాయుడు. సుమారు 18 గంటలపాటు బాలుడు టాయిలెట్​లోనే ఉండిపోయాడు. తరువాత రోజు ఉదయం వేరే ఉపాధ్యాయులు బాత్​రూమ్​ డోర్​ను తెరవగా బయటకొచ్చాడు బాలుడు. ఈ అమానవీయ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

Teacher Locked Dalit Student
Teacher Locked Dalit Student
author img

By

Published : Aug 15, 2022, 3:27 PM IST

Teacher Locked Dalit Student In BathRoom: ఉపాధ్యాయ వృత్తికే మచ్చ తెచ్చే ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. పాఠశాలలో ఆరో తరగతి చదువుకుంటున్న ఓ దళిత విద్యార్థి పట్ల ఉపాధ్యాయుడు అమానవీయంగా ప్రవర్తించాడు. స్కూల్​ ముగిసే సమయంలో టాయిలెట్​లో పెట్టి తాళం వేసేశాడు. సుమారు 18 గంటలపాటు బాత్​రూమ్​లోనే బాలుడు ఉండిపోయాడు. మరుసటి రోజు ఉదయం​ డోర్​ ఓపెన్​ చేయగా బయటకు వచ్చాడు.

ఇదీ జరిగింది.. జిల్లాలోని భిధూనా ప్రాంతంలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలో 11 ఏళ్ల విద్యార్థి ఆరో తరగతి చదువుకుంటున్నాడు. అదే స్కూల్​లో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉపాధ్యాయుడు.. ఆగస్టు 5వ తేదీన పాఠశాల ముగిసే సమాయానికి చిన్నారిని బాత్​రూమ్​లోకి లాక్కెల్లి డోర్ వేసి తాళం వేశాడు. అనంతరం మొత్తం ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారు. సహాయం కోసం బాధిత విద్యార్థి ఎంత అరిచినా ఎవరూ రాలేదు. దీంతో రాత్రంతా మరుగుదొడ్డిలోనే ఉన్నాడు విద్యార్థి. అయితే రోజూ ఇంటికి వచ్చే సమయానికి విద్యార్థి రాకపోవడం వల్ల అనుమానమొచ్చి బాలుడి తల్లిదండ్రులు ఊరంతా వెతికారు. ఎక్కడా అతడి ఆచూకీ లభించలేదు.

తరువాత రోజు ఉదయం పాఠశాలకు మిగతా ఉపాధ్యాయులతోపాటు బాలుడి తల్లిదండ్రులు వచ్చారు. అన్ని క్లాస్​రూమ్​లను తెరవగా.. ఎక్కడా బాలుడు కనిపించలేదు. చివరకు బాత్​రూమ్​ ఓపెన్​ చేయగా చిన్నారి అందులో ఏడుస్తూ కూర్చున్నాడు. బయటకు వచ్చి తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పారు. వెంటనే బాధితుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఉపాధ్యాయుడిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

నీటి కుండ ముట్టాడని..
రాజస్థాన్ జాలోర్​లోని ఓ పాఠశాలలో అగ్రవర్ణాల వారి కోసం ఏర్పాటు చేసిన నీటి కుండను దళిత విద్యార్థి(9) తాకాడని తీవ్రంగా కొట్టాడు ఉపాధ్యాయుడు. తీవ్రగాయాలతో విద్యార్థి మరణించాడు. నిందితుడు చైల్​సింగ్​ను(40) పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఇవీ చదవండి: జెండాకు సెల్యూట్ చేస్తూ మాజీ జవాన్ మృతి

గోడ కూలి ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి, లారీ ఢీకొని మరో ఐదుగురు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.