ETV Bharat / bharat

Honey trap: కిలాడీ కపుల్​.. హనీట్రాప్​తో 300 మందికి టోకరా!

యువకులను టార్గెట్ చేస్తూ.. వలపు వల(Honey trap) విసురుతారు. నగ్నంగా వీడియోకాల్ చేసి​ కవ్విస్తారు. అవతలి వారినీ అలాగే చేయమంటారు. ఆ తర్వాతే అసలు డ్రామాకు తెరలేపుతారు. నగ్న వీడియోలను రికార్డు చేసి అమాయకుల వద్ద నుంచి అందినకాడికి దోచుకుంటారు. ఉత్తర్​ప్రదేశ్​ కేంద్రంగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారంలో బాధితులెవరూ ఫిర్యాదు చేయనప్పటికీ.. మరో కేసు దర్యాప్తులో భాగంగా 'హనీ ట్రాప్' మోసం బయటికొచ్చింది.

honey trap
హనీ ట్రాప్
author img

By

Published : Oct 24, 2021, 6:37 PM IST

నగ్నంగా వీడియో కాల్స్‌ చేస్తారు. అవతలి వారితోనూ నగ్నంగా(Honey trap) మాట్లాడిస్తారు. ఆ వీడియోలు రికార్డు చేసి అడిగినంత ఇవ్వకపోతే ఇంటర్నెట్‌లో పెడతామని బ్లాక్‌ మెయిల్‌ చేస్తారు. ఇలా 300 మందిని మోసగించి.. రూ.20 కోట్లకు పైగా వసూలు చేసిందో ముఠా. పరువుకు భయపడి బాధితులు ఫిర్యాదు చేయకపోయినా.. తీగలాగితే ఈ డొంక కదిలిందన్నట్టుగా చిన్న కేసులో భాగంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ మోసాన్ని గుట్టురట్టు చేశారు. భార్యాభర్తలు సహా ఐదుగురిని అరెస్ట్‌ చేశారు.

యూపీలోని ఘాజియాబాద్‌కు చెందిన భార్యాభర్తలైన సప్నా గౌతమ్‌, యోగేశ్‌ ఈ కేసులో ప్రధాన నిందితులు. సులువుగా డబ్బు సంపాదించాలన్న ఆశతో ఈ తరహా మోసాలకు తెరతీశారు. ఈ జంటకు ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన సలహా మేరకు ఈ తరహా మోసాలు ప్రారంభించారు. ఈ దందాలో ఒక్కొక్కరిదీ ఒక్కో పాత్ర. బాధితులతో వీడియో కాల్స్‌ మాట్లాడడం, మరికొందరి యువతులకు శిక్షణ ఇచ్చి వారిచేత కూడా ఇవే పనులు చేయించడం సప్నా పని. బాధితుల వివరాలు, వారి ప్రదేశం, ఫోన్‌ నంబర్‌, బ్యాంకు ఖాతాలను యోగేశ్‌ సేకరిస్తుంటాడు.

honey trap
హనీ ట్రాప్ చేస్తున్న ముఠా

తొలుత ఓ అడల్ట్‌ వెబ్‌సైట్‌లో ఈ ముఠా సభ్యులు పేరు నమోదు చేసుకుంటారు. కొత్త కొత్త ఐడీలతో నగ్నంగా వీడియోకాల్స్‌(Honey trap) చేస్తారు. ఇందుకు నిమిషానికి రూ.234 చెల్లించాలి. ఇందులో సగభాగం వెబ్‌సైట్‌ నిర్వాహకులకు, మిగిలిన సగం వీరికి చేరుతుంటుంది. అయితే, ఇంతకంటే తక్కువ మొత్తానికి తాము వీడియోలో అందుబాటులో ఉంటామంటూ బాధితుల నుంచి వీరు ఫోన్‌ నంబర్లు సేకరిస్తారు. నేరుగా వారికే వాట్సాప్‌, ఇతర మాధ్యమాల ద్వారా వీడియో కాల్స్‌ చేస్తారు. అవతలివారిని కూడా నగ్నంగా మాట్లాడమని సూచిస్తారు. అనంతరం అవతలి వ్యక్తి వీడియోలను రికార్డు చేస్తారు. వారి ఫోన్‌ నంబర్‌కు వీడియోలు పంపించి, అడిగిన మొత్తం చెల్లించాలని డిమాండ్‌ చేస్తారు. కాదంటే వీడియోలు బహిర్గతం చేస్తామని బెదిరిస్తారు. ఇలా ఎంతోమందిని వీరు మోసం చేశారు. ఇలా దాదాపు 300 మంది దగ్గర నుంచి రూ.20 కోట్లకు పైగా వసూలు చేసినట్లు పోలీసులు తమ విచారణలో గుర్తించారు.

అమ్మాయిలకు జీతాలిచ్చి..

ఈ జంట తమతో పాటు మరో 30 మంది వరకు యువతులను ఈ మోసాల్లో భాగస్వాములను చేసింది. నెలకు రూ.25వేల చొప్పున జీతాలు చెల్లించి నగ్న వీడియో కాల్స్‌ చేయించేది. కేవలం టెక్ట్స్‌ మాత్రమే చేసే వారికి రూ.15వేలు చొప్పున వీరు చెల్లించేవారని పోలీసులు తెలిపారు. ఇలా వచ్చే మొత్తంతో వీరు జల్సాలు చేసేవారు. కొత్త కొత్త నంబర్లతో ఎప్పటికప్పుడు తామున్న ప్రదేశాలను మారుస్తుండేవారు. బాధితులెవరూ ఫిర్యాదు చేయడానికి ముందుకు రాకపోవడం వీరి వ్యాపారం ఇన్నాళ్లూ బాగానే సాగిపోయింది.

డొంక కదిలిందిలా..

బాధితులెవరూ ముందుకు రాకపోయినప్పటికీ ఓ కేసు విచారణలో ఈ వ్యవహారం బయటకొచ్చింది. ఓ సీఏ కంపెనీ యజమాని ఫిర్యాదుతో ఈ వ్యవహారం బట్టబయలైంది. తన కంపెనీకి చెందిన ఓ ఉద్యోగి రూ.80 లక్షలను కంపెనీ ఖాతా నుంచి బదిలీ చేసినట్లు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా వారు ఘజియాబాద్‌ పోలీసులను ఆశ్రయించడంతో తీగ లాగితే డొంక కదిలింది. మోసాలకు పాల్పడుతున్న భార్యాభర్తలు సహా, మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరి అరెస్ట్‌ వ్యవహారం తర్వాత చాలా మంది బాధితుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.