హిమాచల్ ప్రదేశ్‌లో ప్రకృతి మరోసారి కన్నెర్ర చేసింది. కిన్నౌర్ జిల్లాలోని రెకాండ్ పియో- సిమ్లా రహదారిపై పెద్ద ఎత్తున.. కొండచరియలు విరిగిపడటం వల్ల శిథిలాల కింద 50-60మందికి పైగా చిక్కుకుపోయారు. బుధవారం మధ్యాహ్నం 12:45 గంటలకు ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు.
-
#WATCH | ITBP personnel rescue a man trapped in the debris of a landslide on Reckong Peo-Shimla Highway in Nugulsari area of Kinnaur, Himachal Pradesh
— ANI (@ANI) August 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
As per the state govt's latest information, nine people have been rescued & one person has died. Search operation is underway pic.twitter.com/NZ46tpg1Se
">#WATCH | ITBP personnel rescue a man trapped in the debris of a landslide on Reckong Peo-Shimla Highway in Nugulsari area of Kinnaur, Himachal Pradesh
— ANI (@ANI) August 11, 2021
As per the state govt's latest information, nine people have been rescued & one person has died. Search operation is underway pic.twitter.com/NZ46tpg1Se#WATCH | ITBP personnel rescue a man trapped in the debris of a landslide on Reckong Peo-Shimla Highway in Nugulsari area of Kinnaur, Himachal Pradesh
— ANI (@ANI) August 11, 2021
As per the state govt's latest information, nine people have been rescued & one person has died. Search operation is underway pic.twitter.com/NZ46tpg1Se
కిన్నౌర్ నుంచి సిమ్లాకు వెళ్తోన్న హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వ రవాణాకు చెందిన ఓ ప్రయాణికుల బస్సు, ఓ ట్రక్కు, కొన్ని కార్లు కొండచరియల కింద చిక్కుకున్నట్లు ఐటీబీపీ పోలీసులు వెల్లడించారు. బస్సులోనే సుమారు 40 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు కిన్నౌర్ డిప్యూటి కమిషనర్ హుస్సేన్ సిద్ధిఖ్ చెప్పారు.
బస్సు డ్రైవర్ సహా 9 మంది సురక్షితం..
ప్రమాదస్థలిలో ఎన్‌డీఆర్‌ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ 17, 19, 43వ బెటాలియన్ బలగాల ఆధ్వర్యంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే బస్సు డ్రైవర్, కండక్టర్ సహా.. మరో 12 మందిని బలగాలు రక్షించినట్లు సీఎం జైరామ్ ఠాకూర్ తెలిపారు. బస్సులో ఉన్న ప్రయాణికుల సంఖ్యను తెలిపే స్థితిలో వారు లేరని చెప్పారు. మిగిలిన వారి ఆచూకీ కోసం కూడా బలగాలు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు చెప్పారు.
సీఎంకు ప్రధాని ఫోన్..
హిమాచర్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్‌కు ఫోన్ చేసి ప్రమాదంపై ఆరా తీశారు ప్రధాని నరేంద్ర మోదీ. సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్‌కు అన్ని విధాల మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చినట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది.
అమిత్ షా ఆరా..
ప్రమాదంపై హోంమంత్రి అమిత్ షా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్‌కు ఫోన్ చేసి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్‌కు కావాల్సిన పూర్తి సహకారాన్ని అందించనున్నట్లు అమిత్‌షా భరోసా ఇచ్చారు. మరోవైపు స్థానిక పోలీసులను, సహాయక సిబ్బందిని సీఎం జైరామ్ ఠాకూర్ అప్రమత్తం చేశారు. యుద్ధప్రాతిపదికన చర్యలు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.