ETV Bharat / bharat

రెసిడెంట్ డాక్టర్ల ఆందోళనలో ఉద్రిక్తత- వైద్యులను నిర్బంధించి.. - resident doctors strike news

Resident Doctors Strike: నీట్- పీజీ 2021 కౌన్సిలింగ్​ ఆలస్యం కావడాన్ని నిరసిస్తూ రెసిడెంట్ డాక్టర్లు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. నిరసనలకు దిగిన వైద్యులను పోలీసులు నిర్భందించారు. డాక్టర్లపై దాడిని 'ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ ఆసోసియోషన్​'(ఎఫ్ఓ​ఆర్​డీఏ) ఖండించింది.

resident doctors strike
రెసిడెంట్ డాక్టర్ల ఆందోళనలో ఉద్రిక్తత
author img

By

Published : Dec 27, 2021, 11:08 PM IST

రెసిడెంట్ డాక్టర్ల ఆందోళనలో ఉద్రిక్తత

Resident Doctors Strike: నీట్​- పీజీ 2021 కౌన్సిలింగ్​ ఆలస్యాన్ని నిరసిస్తూ.. దిల్లీలో రెసిడెంట్ వైద్యులు చేపట్టిన నిరసనలు ఉద్రిక్తతకు దారితీశాయి. డాక్టర్లు, పోలీసుల మధ్య కాసేపు తోపులాట జరిగింది.

వైద్యులపై దాడిని 'ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ ఆసోసియోషన్​' (ఎఫ్ఓ​ఆర్​డీఏ) ఖండించింది. నిర్భంధించిన డాక్టర్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. శాంతియువతంగా నిరసన చేస్తున్న తమపై.. పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించారని ఎఫ్ఓ​ఆర్​డీఏ డైరెక్టర్ డాక్టర్. మనీశ్​ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల చర్యను బ్లాక్​ డేగా అభివర్ణించారు.

డాక్టర్​లపై దాడిని అన్నిరాష్ట్రాల్లో ఉన్న రెసిడెంట్ వైద్యుల బృందం ఖండించింది. అన్యాయానికి వ్యతిరేకంగా తాము ప్రారంభించిన పోరాటం సాగుతూనే ఉంటుందని ఎఫ్ఓ​ఆర్​డీఏ స్పష్టం చేసింది.

దేశవ్యాప్తంగా ఉన్న రెసిడెంట్ డాక్టర్లు.. ఏకంకావాలని దిల్లీలోని ఆర్​ఎంఎల్ ఆస్పత్రి రెసిడెంట్ డాక్టర్స్ బృందంలోని సభ్యురాలు డాక్టర్​. సర్వేశ్​ పాండే తెలిపారు. కరోనా వారియర్స్​పై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండించాలని పిలుపునిచ్చారు.

అండగా ఉంటాం..

ఈ ఘటనపై కాంగ్రెస్​నేత రాహుల్​గాంధీ స్పందించారు. దేశంలోని వైద్యులకు అన్యాయం జరిగిందన్నారు. తాను కరోనా వారియర్స్​ అయిన డాక్టర్లకు అండగా ఉంటానని ట్వీట్​ చేశారు.

resident doctors strike
రెసిడెంట్ డాక్టర్ల ఆందోళనపై రాజీవ్ గాంధీ ట్వీట్

ఇదీ చూడండి: అమానవీయం.. కన్నబిడ్డపైనే తండ్రి అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.